దాదాపు టాలీవుడ్ టాప్ హీరోల అప్ కమింగ్ పిక్చర్ డిటైల్స్ అన్నీ అందరికీ తెలిసినవే. కానీ బన్నీ తరువాతి సినిమా ఏదన్నది మాత్రం సరైన క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు అందుతున్న వార్తల ప్రకారం బన్నీ తరువాతి సినిమా కొత్త దర్శకుడు రెడ్డితో ఫిక్స్అయిందట. ఒక కొత్త దర్శకుడు కమ్ కథకుడు వచ్చి కొన్నాళ్ల క్రితం బన్నీకి కథ చెప్పాడని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో తప్పకుండా చేద్దాం అని బన్నీ మాటిచ్చాడు.
అయితే ఇప్పుడు ఆ సినిమానే తెరకెక్కించే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో సాగుతుంది ఈ సినిమాలోని కథ. తొలిసారి బన్నీ ఓ కొత్త యువ దర్శకుడి సినిమాలో నటించడం మాత్రమే ఈ సినిమా ప్రత్యేకత కాదు. మరోటి కూడా వుంది. ఈ సినిమాతో బన్నీ నిర్మాతగా మారుతున్నాడు. తమ కుటుంబం ఉమ్మడి ఆస్తిగా వుంది గీతా ఆర్ట్స్ బ్యానర్. బన్నీ ఆ బ్యానర్ పై సినిమా చేస్తే మిగిలిన ఇద్దరికీ కూడా లాభం. అదే బన్నీ తన స్వంత బ్యానర్ పై చేసుకుంటే ఆ లెక్క, ఆ లాభం వేరు.
ఇప్పటికే రామ్ చరణ్, మహేష్ లకు స్వంత బ్యానర్ లు వున్నాయి. ఎన్టీఆర్ కు సోదరుడి బ్యానర్ వుంది. పవన్ కు కూడా సమర్పణ వరకు ఓ బ్యానర్ వుంది. ఇప్పుడు బన్నీ కూడా అదే బాటలోకి వచ్చాడు. ఈ కొత్తబ్యానర్ పై కొత్త దర్శకుడితో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఏప్రియల్ ఎండింగ్ లేదా మే లో ప్రారంభమయ్యే అవకాశం వుంది.