బన్నీని ఒప్పించగలరా ఇంద్రగంటి?

హీరో బన్నీతో చిరకాలంగా టచ్ లో వున్నారు దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ. అయితే ఇప్పుడు బన్నీతో సినిమాకు సరిపడే నిర్మాత కూడా రెడీగా వున్నారు. ఇంద్రగంటితో తరువాత సినిమాకు ఒప్పందం కుదర్చుకున్నారు దిల్…

హీరో బన్నీతో చిరకాలంగా టచ్ లో వున్నారు దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ. అయితే ఇప్పుడు బన్నీతో సినిమాకు సరిపడే నిర్మాత కూడా రెడీగా వున్నారు. ఇంద్రగంటితో తరువాత సినిమాకు ఒప్పందం కుదర్చుకున్నారు దిల్ రాజు. అదే విధంగా పొలిటికల్ అండ్ పీపుల్స్ కరెప్షన్ పై 'సభకు నమస్కారం' అనే సబ్జెక్ట్ ఒకటి దిల్ రాజు దగ్గర వుంది.

ఇప్పుడు ఇటు ఇంద్రగంటి, అటు బన్నీ, ఈపక్క 'సభకు నమస్కారం' అన్నీ కలిపి ఓ ప్రాజెక్ట్ చేయాలన్నది దిల్ రాజు సంకల్పం. కానీ బన్నీ ఇంకా ఊ.. ఆ అనడంలేదు. సభకు నమస్కారం సబ్జెక్ట్ విన్నారు. బాగుంది అన్నారు కానీ, తాను చేస్తానో, చేయనో చెప్పలేదు.

ఈ సబ్జెక్ట్ కావచ్చు, మరేదైనా కావచ్చు, ఇంద్రగంటితో ఓకె చేయిస్తే బాగుంటుందని దిల్ రాజు, ఆ డైరక్టర్ ను ఏకంగా బన్నీ దగ్గరే వుంచేసినట్లు బోగట్టా. విక్రమ్ కె కుమార్ సినిమా ఓకె చేసి, అలా వుంచాడు పక్కన, అక్టోబర్ ముహుర్తం ప్రకటనకు అంటూ బన్నీ. మరి ఇంద్రగంటి సబ్జెక్ట్ కు ఎప్పుడు ఊ కొడతారో? ఎప్పుడు ఎస్ ఆర్ నో చెబుతారో? చూడాలి.