Advertisement


Home > Movies - Movie Gossip
బన్నీ వన్.. టూ.. త్రీ ఫిక్స్ డ్

అందరు హీరోలకు సరైన లైనప్ వుంది. బన్నీకే లేదు అన్నది ఇప్పటి దాకా క్రిటిక్స్ నుంచి వస్తున్న కామెంట్. అయితే మొత్తం మీద బన్నీ కూడా మూడు సినిమాలు వరుసగా చేసేలా టెంటటివ్ గా ఒకే చేయించేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నకే, హ్యాపీగా పారిస్ కు ఛలో అంటూ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

ఇంతకీ ఏమిటా లైనప్ అంటే.. ఫస్ట్ సినిమా విక్రమ్ కే కుమార్ తో. అది స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అది పూర్తి కాగానే సెట్ మీదకు వెళ్తారు. దాని తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో. ప్రస్తుతం చేస్తున్న అరవింద సమేత సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తారని, ఆ తరువాత బన్నీతో సినిమా చేస్తారని తెలుస్తోంది.

ఈ సినిమా అయిన తరువాత సురేందర్ రెడ్డితో సినిమా వుంటుంది. సైరా తరువాత సురేందర్ రెడ్డి టాగోర్ మధుకు సినిమా చేయాలి. మరి ఆ సినిమానే కావచ్చు, లేదా మరోటి కావచ్చు, బన్నీతో సినిమా వుంటుందని తెలుస్తోంది.

ఈ మేరకు బన్నీ త్రివిక్రమ్, సురేందర్ రెడ్డిలతో డిస్కస్ చేసాడని గీతా యూనిట్ వర్గాల బోగట్టా. కానీ ఒక్కటే అనుమానం. త్రివిక్రమ్, సురేందర్ రెడ్డి మాట ఇచ్చి వుండొచ్చు. అయితే ఇటు హిట్ లు లేకపోయినా, అటు హిట్ లు లేకపోయినా? ఈ మాటలు మాటల్లా వుంటాయా? అన్నదే.