సాధారణంగా ప్రెస్ మీట్ పెడితే మీడియా ప్రశ్నలు అడుగుతుంది. సెలబ్రిటీలు సమాధానం ఇస్తారు. ఒక్కోసారి సెలబ్రిటీలను బట్టి, ఈ ప్రశ్నలు అడగొద్దు, ప్లీజ్ అంటూ మీడియా జనాలకు హీరో మనుషులు రిక్వెస్ట్ చేస్తుంటారు. అది కూడా అలవాటే. కానీ హీరో ప్రెస్ మీట్ పెడితే, వచ్చిన మీడియా జనాలకు వీలయితే ఈ ప్రశ్నలు అడగండి అంటూ ఫీడింగ్ ఇవ్వడం కొత్త విషయం.
ఈ మధ్య జరిగిన అలవైకుంఠపురం సక్సెస్ మీట్ కు వచ్చిన మీడియా జనాల్లో కొందరు కీలకమైన వారికి ఈ అనుభవం ఎదురైంది. సాధారణంగా ప్రెస్ మీట్ కు వచ్చిన వారు అందరూ ప్రశ్నలు అడగరు. కొందరు ఆసక్తిగా ఎక్కువ అడుగుతారు. కొందరు తక్కువ అడుగుతారు.
అయితే ఈసారి అలా ఆసక్తి గా ఎక్కువ అడిగేవారికి బన్నీ యూనిట్ ముందే ఫీడింగ్ ఇచ్చిందట. కొన్ని ప్రశ్నలు అడగమంటూ రిక్వెస్ట్ చేసిందట.
బన్నీ ని ఈ ప్రశ్నలు అడగండి ప్లీజ్?
ఇండస్ట్రీ రికార్డు కొట్టారు కదా ఎలా ఫీలవుతున్నారు?
సంక్రాంతి విన్నర్ మీరే కదా? ఎలా ఫీలవుతున్నారు?
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ మీదే కదా? ఏమంటారు?
బాహుబలి వన్ రికార్డు దాటారు కదా? ఎలా అనిపిస్తోంది?
ఇదీ జరిగింది. అసలు బన్నీ యూనిట్ ఇలా క్వశ్చన్ల ఫీడింగ్ ఇవ్వడం అంటే, ఆ యూనిట్ జనాలకు ముందుగానే బన్నీ నుంచి ఫీడింగ్ వచ్చి వుండాలి.
అలా ప్రశ్నలు వేస్తే, పదే పదే ప్రెస్ మీట్ లో బన్నీ తన ప్రమేయం లేకుండా రికార్డుల గురించి మాట్లాడినట్లు అవుతుంది. అప్పుడు బన్నీని ఎవ్వరూ తప్ప పట్టరు. అదన్నమాట స్కీము.