మరో పదిహేను ఇరవై రోజులు షూట్ చేస్తే మొత్తం వర్క్ అయిపోతుంది బన్నీ నాపేరు సూర్య సినిమాకు. అలాంటి టైమ్ లో చిన్న చిక్కొచ్చి సినిమా షూట్ కు బ్రేక్ పడింది. అది కూడా బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కారణంగా. అదెలా? అంటే.. ఇలా.
బన్నీ సినిమా క్లయిమాక్స్ తరువాత వచ్చే చిన్న ఎక్స్ టెండెట్ క్లయిమాక్స్ షూట్ కు బాగా స్నో వున్న ఏరియా కావాలి. పైగా ఓ సాంగ్ కూడా పనిలో పని అలాంటి చోట లాగించేస్తే బాగుంటుంది. అందుకే డార్జిలింగ్ ను ఎంచుకున్నారు. అంతా సెట్ అయింది. ఒక యూనిట్, నటులు వెళ్లిపోయారు. మరో యూనిట్ ఆన్ ది వే వుంది.
ఇంతలో బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ డార్జిలింగ్ టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఒక రోజు కాదు. మూడు నాలుగు రోజులు. పైగా డార్జిలింగ్ ఆ రాష్ట్రానికి చాలా కీలకప్రాంతం. దాంతో షూటింగ్ పర్మిషన్లు అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి.
దీంతో మొత్తం యూనిట్ అంతా వెనక్కు రాక తప్పదు. అందుకే కాశ్మీర్ లో పర్మిషన్ల కోసం ప్రయత్నిస్తున్నారు. అనుమతులు వస్తే, డార్జిలింగ్ నుంచి యూనిట్ ను నేరుగా కాశ్మీర్ తరలించి అక్కడ వర్క్ ఫినిష్ చేసుకుని వస్తారు.