Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బన్నీ వివరణ వెనుక భలే స్ట్రాటజీ

బన్నీ వివరణ వెనుక భలే స్ట్రాటజీ

చెప్పను బ్రదర్ వివాదంపై వివరణ ఇవ్వాలని బన్నీ డిసైడ్ అయిన మరుక్షణం దానిపై చాలా కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది. ఒక్క మనసు అడియో ఫంక్షన్ కు హాజరై బన్నీ వివరణ ఇస్తాడని ఉదయమే కొద్దిగా బయటకు పొక్కింది. అప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి ఎలా సమాధానం చెప్పాలి అన్నది చాలా సేపు డిస్కషన్లు చేసి, ఆఖరికి ఫైనల్ వెర్షన్ డిసైడ్ చేసారని తెలుస్తోంది. 

వన్స్ డిసైడ్ అయ్యాక, ఒక్క మనసు అడియో ఫంక్షన్ పాస్ లు వందల సంఖ్యలో తీసుకున్నారు. బన్నీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అందరికీ కబురు చేసి, ఈ పాస్ లు పంపిణీ జరిపారు. వారందరికీ అడియో ఫంక్షన్ లో ఎలా వ్యవహరించాలో, ఎవర్ని కట్టడి చేయాలో ఫీడింగ్ ఇచ్చారని వినికిడి. 

బన్నీ వచ్చేసరికి అడియో ఫంక్షన్ లో అప్పటికే అతని ఫ్యాన్స్ డామినేషన్ స్టార్ట్ అయిపోయింది. ప్లే కార్డులు, అరుపులు అన్నీ బన్నీకి సంబంధించే. వీటి ముందు పవర్ స్టార్ అభిమానుల అరుపులు కాస్త తగ్గాయి.  బన్నీ స్పీచ్ స్టార్ట్ చేయగానే అతని ఫ్యాన్స్ ఎక్కడికక్కడ రంగంలోకి దిగి, పవర్ స్టార్ అని అరిచేవాళ్లను కట్టడి చేసినట్లు వినికిడి. 

ఒకటి రెండు బాహాబాహీ సంఘటనలు కూడా జరిగాయని తెలుస్తోంది. ఎప్పుడైతే ఈ ఫ్యాన్స్..ఆ ఫ్యాన్స్ ఢీ కొన్నారో, ఇక పవర్ అరుపులు తగ్గిపోయాయి. బన్నీ సక్సెస్ ఫుల్ గా తన క్లాస్ తాను పీకేసి, వేదిక దిగిపోయాడు. మొత్తానికి అల్లు స్ట్రాటజీ అలా అమలు జరిగిందని వినికిడి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?