హీరోలు ఫుల్ బిజీగా వుంటారు. వాళ్ల కోసం, వాళ్ల తరపున తెరవెనుక అనేక విషయాలు చక్కబెడుతూ హీరోల వైఫ్ లు కూడా యాక్టివ్ గానే వుంటారు. అందులో కొందరు అయితే సోషల్ మీడియాలో ఫుల్ స్వింగ్ లో వుంటారు. ఉపాసన, స్నేహారెడ్డి ఇలా మరి కొందరు ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ ల్లో చాలా పాపులర్, బిజీ కూడా. తన భర్తల సినిమాలకు సంబంధించిన విషయాలు షేర్ చేసుకోవడం, యాక్టివ్ గా వుండడం వంటివి వీళ్లు చేస్తుంటారు. వీళ్లకు ఫాలోవర్లు కూడా ఎక్కువే.
అయితే ఇన్ స్టా గ్రామ్ లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి వన్ మిలియన్ ఫాలోవర్లతో స్టార్ భార్యల్లో కొత్త రికార్డు సృష్టించారు. ట్విట్టర్ లో మాదిరిగా కాదు, ఇన్ స్టా గ్రామ్ లో ఫాలోవర్లు మిలియన్లకు మిలియన్లు వుండడం అంత సులువుకాదు. బాలీవుడ్ లో షాహిద్ కపూర్ వైఫ్ మీరాకు వన్ మిలయన్ ఫాలోవర్లు వున్నారు. ఇప్పుడు ఈ ఫీట్ ను స్నేహా కూడా సాధించారు.
బన్నీకి సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ వుంది. యూట్యూబ్ లో అతగాడి సినిమాలకు మిలియన్లకు మిలియన్ల హిట్ లు వస్తాయి. ఇప్పుడు అదేబాటలో స్నేహారెడ్డి కూడా వెళ్తూ, ఫాలోవర్లను పెంచుకుంటున్నారు.