సినిమాలకు లాస్ట్ మినిట్ లో బయ్యర్లు హ్యాండ్ ఇవ్వడం మామూలే. ఆ టైమ్ కు ఏదోసాకు దొరకుతుంది. లేటెస్ట్ గా అంతరిక్షం అలాంటి సమస్యలే ఎదుర్కోంటోంది. ఒకేసారి మూడు నాలుగు సినిమాలు వస్తుండడం అన్నది బయ్యర్లకు సాకుగా దొరికింది.
అంతరిక్షం సినిమాను ఆంధ్రకు ఏడు నుంచి ఎనిమిది కోట్ల రేషియోలో తీసుకుంటా అని హీరో శర్వానంద్ సోదరుడు అర్జున్, నైజాంకు అయిదున్నర కోట్ల రేషియోలో తీసుకుంటా అని దిల్ రాజు ముందుకు వచ్చారు. అయితే ఈ మాటలు జరిగిన నాటికి అది సోలో రిలీజ్.
కానీ ఇప్పుడు పడి పడి లేచె మనసు, మారి 2, కేజిఎఫ్ లాంటి సినిమాలు వచ్చేసాయి. పైగా సీజన్ అస్సలు బాగాలేదు. మరోపక్క తుపాను అంటున్నారు. దీంతో బయ్యర్లు వెనకడుగు వేసేస్తున్నారు. కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిన శర్వానంద్ సోదరుడు దాన్ని వదులుకుందుకైనా సిద్దమై, అంతరిక్షానికి హ్యాండ్ ఇచ్చేసారని తెలుస్తోంది.
ఇక దిల్ రాజు మాత్రం రేటు తగ్గించడమో, లేదా డైరక్ట్ డిస్ట్రిబ్యూషన్ కు ఇవ్వడమో చేయమని కోరుతున్నట్లు తెలుస్తోంది. అయదున్నర కోట్లు నైజాంలో ఈ పరిస్థితుల్లో కిట్టు బాటు కాదంటున్నట్లు తెలుస్తోంది. వస్తే మీకే ఇస్తా అని, కమిషన్ మీద పంపిణీ చేస్తా అని ఆయన అంటున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి ఇదంతా కాస్త సెట్ బ్యాక్ నే అంతరిక్షం సినిమాకు.
జగన్, పవన్ కలిసి పనిచేసినా మాకు ఓకే
త్వరలో ఎన్నికలు.. కాంగ్రెస్ తో పొత్తూ వికటించింది.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్