చైతన్య.. సమంత ఇప్పుడు చెన్నయ్ బాటపట్టారు. ఇద్దరికీ అక్కడ అత్తారిళ్లు వున్నాయి. సమంత తల్లితండ్రులు వుండేది చెన్నయ్ లోనే. చైతన్య తల్లి వుండేది చెన్నయ్ లోనే. అంటే ఇద్దరి అత్తారిళ్లు చెన్నయ్ లోనే. అందువల్ల బోలెడు మంది బంధువులు వున్నారు ఇప్పుడు చెన్నయ్ లో వారిద్దరికి.
అందుకే పెళ్లయిన తరువాత హైదరాబాద్ బంధు బలగం పలకరింపులు ముగిసాయి. ఇప్పుడు చెన్నయ్ బంధు బలగాన్ని చుట్టేయడానికి బయల్దేరారు. నవంబర్ ఫస్ట్ వీక్ దాకా చైతన్యకు వర్క్ లేదు. చైతన్య-చందు మొండేటి-మైత్రీ మూవీస్ సినిమా షెడ్యూలు ప్రారంభానికి నవంబర్ 7నో 8నో మాంచి ముహుర్తం ఫిక్స్ చేసారు. అక్కడి నుంచి కంటిన్యూగా షెడ్యూలే అన్నమాట. అదే విధంగా సమంత మహానటి సినిమా షెడ్యూలు ఫిక్స్ కావాల్సి వుంది.
సో కొంతకాలం వరకు, చైతన్య-సమంతలకు ఆటవిడుపు. అంతవరకు చెన్నయ్ లో, ఆపైన కాస్త టైమ్ దొరికితే అలా అబ్రాడ్. అది ప్రొగ్రామ్ అంట.