చరణ్‌ చేసిన రెండు బ్లండర్స్‌

ఒక టైమ్‌లో వరుసపెట్టి సక్సెస్‌ఫుల్‌ సినిమాలు చేసిన రామ్‌ చరణ్‌ సడన్‌గా ఫామ్‌ కోల్పోయాడు. కొన్ని రాంగ్‌ డెసిషన్లు తీసుకుని రేసులో వెనుకపడిపోయాడు. అవుట్‌డేటెడ్‌ అయిపోయిన కృష్ణవంశీతో 'గోవిందుడు అందరివాడేలే' చేయడం, పెద్ద ఫ్లాప్‌…

ఒక టైమ్‌లో వరుసపెట్టి సక్సెస్‌ఫుల్‌ సినిమాలు చేసిన రామ్‌ చరణ్‌ సడన్‌గా ఫామ్‌ కోల్పోయాడు. కొన్ని రాంగ్‌ డెసిషన్లు తీసుకుని రేసులో వెనుకపడిపోయాడు. అవుట్‌డేటెడ్‌ అయిపోయిన కృష్ణవంశీతో 'గోవిందుడు అందరివాడేలే' చేయడం, పెద్ద ఫ్లాప్‌ ఇచ్చిన తర్వాత శ్రీను వైట్లని గుడ్డిగా నమ్మడం రామ్‌ చరణ్‌ని వెనక్కి నెట్టాయి.

ఈ రెండు చిత్రాలకి బదులుగా అతను వేరే సినిమాలు చేయాల్సి వుంది. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ఓకే చేసుకుని కూడా లాస్ట్‌ మినిట్‌లో కృష్ణవంశీతో చేసాడు. అప్పటికి మిర్చి తీసిన కొరటాల శివ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్‌లాంటి బ్లాక్‌బస్టర్లు ఇచ్చాడు. చరణ్‌ ఖచ్చితంగా ఒక బంపర్‌ ఆఫర్‌ పోగొట్టుకున్నాడు.

అలాగే బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో కూడా సినిమా వద్దనుకున్నాడు. మాస్‌ సినిమాలు చేయడం వల్ల తనపై మూస ముద్ర వేసేస్తున్నారని బోయపాటి సినిమా కాదనుకుంటే అతను అల్లు అర్జున్‌కి సరైనోడుతో బిగ్గెస్ట్‌ హిట్‌ అందించాడు. థని ఒరువన్‌ రీమేక్‌ చేయడం దండగ అని చాలా మంది అంటున్నా కానీ 'ధృవ' చేస్తున్నాడు. మరి ఈ నిర్ణయమైనా అతనికి కోరుకున్న ఫలితాన్ని ఇస్తుందో లేదో?