శ్రీనువైట్ల-రామ్ చరణ్ కాంబినేషన్ లోని సినిమాలో హీరో తన సోదరి ఐఎఎస్ చదువుకోసం సినిమా ఫైట్ మాస్టర్ గా, డూప్ గా పనిచేస్తాడని ఇప్పటికే రివీల్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఫైట్లు వైవిధ్యంగా, వినూత్నంగా వుండేందుకు రామ్ చరణ్ కసరత్తు మొదలెట్టాడట.
Advertisement
బ్యాంకాక్ వెళ్లి కొన్ని ఫైటింగ్ టెక్నిక్ ల్లో మెళకువలు నేర్చుకుంటున్నాడట. త్వరలో తిరిగి వచ్చి షూటింగ్ లో పాల్గొంటాడట. అంతవరకు రామ్ చరణ్ కాంబినేషన్ లేని సీన్లు ఇక్కడ కానిచ్చేస్తున్నారు. ఈ సినిమా ఎలాగైనా దసరా సీజన్ కు తీసుకురావాలన్నది యూనిట్ ప్రయత్నం.