చరణ్‌ ‘మెగా’ గిఫ్ట్‌ ఎలా వుంటుందో.!

రేపు చిరంజీవి పుట్టినరోజు.. తన తండ్రి పుట్టినరోజుకి చిరంజీవి మెగా గిఫ్ట్‌ ఇవ్వనున్నాడు. అదేంటో తెలుసా.? ఓ పెయింటింగ్‌. ఈ విషయాన్ని స్వయంగా చరణ్‌ వెల్లడించాడు. అయితే, ఆ పెయింటింగ్‌లో ఏముంటుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సేనట.…

రేపు చిరంజీవి పుట్టినరోజు.. తన తండ్రి పుట్టినరోజుకి చిరంజీవి మెగా గిఫ్ట్‌ ఇవ్వనున్నాడు. అదేంటో తెలుసా.? ఓ పెయింటింగ్‌. ఈ విషయాన్ని స్వయంగా చరణ్‌ వెల్లడించాడు. అయితే, ఆ పెయింటింగ్‌లో ఏముంటుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సేనట. కానీ, ఆ పెయింటింగ్‌ చాలా అద్భుతమని చరణ్‌ చెబుతున్నాడు. చిరంజీవికి ఆ పెయింటింగ్‌ ఇచ్చిన తర్వాత, దాన్ని సోషల్‌ మీడియాలో వుంచుతానని చరణ్‌ చెప్పుకొచ్చాడు. 

ఇక, నిర్మాతగా తాను చిరంజీవి కొత్త సినిమా సెట్స్‌లోకి నాలుగైదుసార్లు మాత్రమే వెళ్ళాడనని అంటున్నాడు చరణ్‌. 150 సినిమాలు చేసి కూడా, మళ్ళీ కెరీర్‌ని మొదటి నుంచీ మొదలు పెడుతున్నట్లే సెట్స్‌లోకి చిరంజీవి వస్తుండడం అందరికీ ఇన్‌స్పయిరింగ్‌గా ఉంటోందని చరణ్‌ ఉద్వేగానికి లోనవుతూ చెప్పాడు. రేపు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా, చిరంజీవి కొత్త సినిమా ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేయనున్నారు. టైటిల్‌తోపాటు, అనేక అంశాలపై క్లారిటీ ఇవ్వనున్నారు. 

వినాయక్‌ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రామ్‌చరణ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం, వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న విషయం విదితమే. తమిళంలో ఘనవిజయం సాధించిన 'కత్తి' సినిమాకి ఇది తెలుగు రీమేక్‌. చిరంజీవి సినిమా టైటిలేంటో, చిరంజీవికి చరణ్‌ ఇవ్వబోయే ఆ పెయిటింగ్‌ ఏమిటో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.