చరణ్ సినిమా టాకీ చకచకా

రామ్ చరణ్-శ్రీను వైట్ల కాంబినేషన్ లో సినిమా షూటింగ్ యమా స్పీడ్ గా సాగుతోంది. ఫైటింగ్ సీక్వెన్స్ లు అయిపోయాయి. టాకీ పార్ట్ లాగించేస్తున్నారు. ఫైటింగ్ సీన్లు, పాటలే కాస్త టైమ్ తీసుకుంటాయి..మిగిలిన టాకీ…

రామ్ చరణ్-శ్రీను వైట్ల కాంబినేషన్ లో సినిమా షూటింగ్ యమా స్పీడ్ గా సాగుతోంది. ఫైటింగ్ సీక్వెన్స్ లు అయిపోయాయి. టాకీ పార్ట్ లాగించేస్తున్నారు. ఫైటింగ్ సీన్లు, పాటలే కాస్త టైమ్ తీసుకుంటాయి..మిగిలిన టాకీ చురుగ్గానే అయిపోతుంది. 

అలాంటిది ఫైటింగ్ సీన్లు కానిచ్చేసి, టాకీకి వచ్చేసారంటే, అక్టోబర్ రిలీజ్ టార్గెట్ ను  చేరుకోవడానికి యూనిట్ కిందా మీదా పడుతోందని అర్థమైపోతోంది. మరో రెండు మూడు వారాల్లో ఈ టాకీ పార్ట్ పూర్తి చేసుకుని, బ్యాలెన్స్ సాంగ్స్ మీదకు వెళ్తారట. 

అన్నట్లు ఇంకా ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ కాలేదు. మైనేమ్ ఈజ్ రాజు, సుప్రీమ్, బ్రూస్లీ అనేవి అభిమానుల ఉత్సాహంలోంచి పుట్టుకొచ్చినవి తప్ప వేరు కాదు. సరైన టైటిల్ కోసం అన్వేషణ సాగుతోంది.