ఎవరు ఎన్ని చెప్పినా, మెగా హీరోలో బన్నీకి రామ్ చరణ్ కు మధ్య కనిపించని పోటీ వుందన్నది ఆ క్యాంప్ క్లోజ్ సర్కిల్ కు తెలిసిన వాస్తవం. ఆ క్లోజ్ సర్కిల్ ద్వారా ఆ వాస్తవం గుసగుసల కింద బయటకు వస్తూనే వుంటాయి. బన్నీ రైజింగ్ అన్నది మాత్రం ఆగడం లేదు. బన్నీకి చరణ్ కు మధ్య పరోక్ష పోటీ తప్పడం లేదు. ఇలాంటి టైమ్ లో బన్నీ తీసుకున్న ఓ మూవ్ ఇండస్ట్రీలో అనేక గుసగుసలకు దారి తీస్తోంది. బన్నీ కావాలనే రామ్ చరణ్ ను కార్నర్ లోకి నెట్టేందుకు ఈ మూవ్ తీసుకున్నారని గ్యాసిప్ వినిపిస్తోంది.
రామ్ చరణ్ కు స్వయానా బాబాయ్, అతనితో సినిమా తీసి దారుణంగా నష్టపోయారు. ఆ నష్టాల సమయంలోనే అన్న చిరంజీవి ఆదుకోలేదని, నాగబాబును పవన్ కళ్యాణ్ నే ఆదుకున్నారని చాలా గుసగుసలు వున్నాయి. అప్పట్లో అందుకోసమే, పవన్ తన డేట్ లు వగైరా చూసే వ్యవహారం నాగబాబుకు ఇచ్చి, ఆర్థికంగా ఆదుకున్నారని గుసగుసలు వున్నాయి. అవన్నీ ఎంతవరకు నిజమో కానీ నాగబాబు మళ్లీ సినిమా తీయలేకపోయారు. రామ్ చరణ్ ఆ తరువాత మళ్లీ నాగబాబుకు చాన్స్ ఇవ్వలేదు.
ఇప్పుడు వున్నట్లుండి ఎప్పటి విషయమో దృష్టిలో పెట్టుకుని, చరణ్ తో పోల్చుకుంటే బంధుత్వం తక్కువే అయిన బన్నీ నాగబాబును ఆదుకోవడానికి ముందుకు రావడం అంటే చిత్రమే. నాగబాబు అంటే మెగా ఫ్యాన్స్ లో చాలా కీలకం. మెగా ఫ్యాన్స్ అందరికీ నాగబాబుతో సాన్నిహిత్యం వుంది. వారిని పలకరించగల, మందలించగల చనువు కూడా నాగబాబుకే వుంది. తన ఫ్యాన్ బేస్, తన వ్యవహారాలు, తన సినిమాలు ఇలా అన్నింటా వెల్ ఫ్లాన్డ్ గా ముందుకు వెళ్తున్న బన్నీ, చాలా స్ట్రాటజిక్ గానే నాగబాబుకు తన సినిమా ప్రెజెంట్ చేసే అవకాశం ఇచ్చి, రాయల్టీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
స్వంత అన్నదమ్ముడి కొడుకు వల్ల లాస్ అయితే, ఆదుకోలేదని, వదినగారి అన్నతమ్ముడి కొడుకు మాత్రం ఆదుకుంటున్నాడన్న మాట ఎలాగూ జనంలోకి వెళ్తుంది ఇంక. ఇది బన్నీకి పెద్ద ప్లస్. నిర్మాతగా మారిన రామ్ చరణ్ ఇప్పుడు ఆయన వంతుగా ఏం చేస్తాడో మరి?