చరణ్‌ టైటిల్‌ ‘మై నేమ్‌ రాజు’!

రామ్‌ చరణ్‌ హీరోగా శ్రీను వైట్ల డైరెక్ట్‌ చేయబోతున్న చిత్రానికి కథ సిద్ధమవుతోంది. ప్రస్తుతం వైట్ల అతని రచయితల బృందం స్క్రీన్‌ప్లేపై వర్క్‌ చేస్తున్నారు. డైలాగ్‌ వెర్షన్‌ కూడా రెడీ చేసి బౌండ్‌ స్క్రిప్ట్‌తో…

రామ్‌ చరణ్‌ హీరోగా శ్రీను వైట్ల డైరెక్ట్‌ చేయబోతున్న చిత్రానికి కథ సిద్ధమవుతోంది. ప్రస్తుతం వైట్ల అతని రచయితల బృందం స్క్రీన్‌ప్లేపై వర్క్‌ చేస్తున్నారు. డైలాగ్‌ వెర్షన్‌ కూడా రెడీ చేసి బౌండ్‌ స్క్రిప్ట్‌తో సెట్స్‌ మీదకి వెళ్లబోతున్నారు. జనవరి నెలాఖరులో ఈ చిత్రం షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది. 

ఈ చిత్రానికి ‘మై నేమ్‌ రాజు’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. చరణ్‌ రెగ్యులర్‌గా చేసే కమర్షియల్‌ చిత్రాలకి భిన్నంగా పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో, హీరోయిజం తగ్గకుండా ఈ చిత్రం ఉంటుందట. అలాగే శ్రీను వైట్ల రెగ్యులర్‌ ప్యాట్రన్‌ కూడా ఇందులో లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. 

ఈ చిత్రంలో హీరోయిన్‌ ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. సమంతకి అవకాశాలున్నాయని అంటున్నారు కానీ వేరే పేర్లు కూడా పరిశీలిస్తున్నారట. సోనాక్షి సిన్హా హీరోయిన్‌ అని కూడా ఒక టాక్‌ నడుస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.