కృష్ణవంశీ నుంచి హిట్ వచ్చి చాలా కాలమవుతోంది. కెరీర్ ఆరంభంలో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించిన కృష్ణవంశీ ఈమధ్య మంచి సినిమా తీసిన దాఖలాలు కూడా లేవు. ఇలాంటి టైమ్‌లో అతని డైరెక్షన్లో రామ్ చరణ్ సినిమా చేస్తుండడం మెగా ఫాన్స్‌ని కలవరపరుస్తోంది.
ఇప్పుడు కృష్ణవంశీతో సినిమా చేయడమంటే కోరి పరాజయం కొని తెచ్చుకోవడమే అని అనుకుంటున్నారు. కానీ చరణ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఈ సినిమా సైన్ చేసాడు. చరణ్ చేస్తున్న మాస్ సినిమాలకి భిన్నంగా కృష్ణవంశీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా ఎలా ఉంటుందో అనేది ఎవరికీ తెలియకపోయినా, కృష్ణవంశీ అయితే ఫాన్స్‌కి కాన్ఫిడెన్స్ పెంచే ఒక మాట చెప్పాడు.
ఈ చిత్రం ఒక సకుటుంబ కథా చిత్రమని, వచ్చే యాభై అరవై ఏళ్ల వరకు ఈ సినిమా గురించి చెప్పుకుంటారని కృష్ణవంశీ నమ్మకంగా చెప్పాడు. ఈ చిత్ర కథపై మూడేళ్లకి పైగా వర్క్ చేసిన కృష్ణవంశీ దీనిపై ఎనలేని నమ్మకంతో ఉన్నాడు. శ్రీకాంత్, చరణ్ బాబాయ్, అబ్బాయ్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా నటిస్తోంది. ఫిబ్రవరి 6న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు.