కోర్టుకెళ్తే ఇంటరాగేషన్ లెవెల్ తగ్గిపోతుందా..? కోర్టు ఆదేశాలతో సిట్ గడపతొక్కితే పరిస్థితులు మారిపోతాయా..? ప్రశ్నలు తగ్గిపోతాయా..? సిట్ అధికారులు చార్మికి రాయల్ ట్రీట్ మెంట్ ఇచ్చి పంపించేస్తారా..? పైపై ప్రశ్నలేసి పండ్లరసాలు అందించి సాగనంపుతారా..? ఇలాంటి అనుమానాలేవీ అక్కర్లేదు.
సిట్ తమదైన స్టయిల్ లో నిబంధనలకు లోబడి, రాజ్యాంగాన్ని అనుసరించి, పక్కా లీగల్ గా చార్మికి చుక్కలు చూపించడానికి స్కెచ్ రెడీ చేసింది. ఈరోజు ఉదయం10 గంటల 30 నిమిషాల ప్రాంతంలో చార్మి సిట్ కార్యాలయానికి వచ్చే అవకాశముంది. ఇక అప్పట్నుంచి తమ ప్రతాపం చూపించాలని నిర్ణయించుకున్నారు సిట్ అధికారులు. చార్మిని ఓ అతిథిగా చూసుకుంటామని పైకి ప్రకటించిన సిట్.. లోలోపల మాత్రం ఆమె నుంచి సమస్త సమాచారాన్ని రాబట్టేందుకు వీడియో కెమెరాలతో పాటు రంగం సిద్ధం చేసింది.
కోర్టుకు వెళ్లడంతో చార్మిపై కాస్త గుర్రుగా ఉన్న సిట్.. ఆమెపై ప్లాన్-బిని అమలు చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు విచారించిన ప్రముఖులందర్నీ ఒకే రోజులో ఇంటరాగేట్ చేసి వదిలేశారు. కానీ చార్మిని మాత్రం రెండో రోజు కూడా విచారణకు పిలిపించి ఇరకాటంలో పెట్టాలని ఆలోచిస్తున్నారట పోలీసులు.
విచారణ పూర్తి కాకపోతే రెండో రోజు కూడా ఆఫీస్ కు పిలిపించుకోవచ్చని కోర్టు స్పష్టం చేయడంతో ఈ వెసులుబాటును ఉపయోగించుకొని చార్మిని మరోసారి ఆఫీస్ కు పిలిపించి, మరిన్ని ప్రశ్నలతో కార్నర్ చేయాలని అనుకుంటున్నారట సిట్ పోలీసులు.