ఓ సినిమా హిట్ అయిందంటే, ఆ సినిమా తరువాత అదే హీరోతో సినిమా నిర్మించే వాళ్లు అలెర్ట్ అయిపోతారు. అర్జెంట్ గా తమ సినిమా రెడీ చేసి, మార్కెట్ ను క్యాష్ చేసుకోవాలనుకుంటారు. నితిన్ సినిమా భీష్మ హిట్ కావడంతో, భవ్య సంస్థ తాము నిర్మించే చెక్ సినిమాను అర్జెంట్ గా ఫినిష్ చేసి విడుదల చేయాలనుకుంటోంది.
కానీ హీరో నితిన్ ఆలోచనలు వేరుగా వున్నాయి. బ్యాక్ టు బ్యాక్ హిట్ లు కొట్టాలని ఆలోచిస్తున్నాడు. అందుకే ప్రామిసింగ్ గా వున్న రంగ్ దే సినిమాను ముందుగా ఫినిష్ చేసి విడుదల చేసే ఆలోచనలో వున్నాడు. ఎందుకంటే రంగ్ దే కలర్ ఫుల్ లవ్ స్టోరీ. పైగా వెంకీ అట్లూరి డైరక్షన్.
భవ్య సినిమా చెక్ అన్నది థ్రిల్లర్. అది కూడా అంతగా ఫామ్ లో లేని చంద్రశేఖర్ యేలేటి దర్శకుడు. పైగా ఈ సినిమాలో 80శాతం వరకు హీరో జైలు డ్రెస్ లోనే వుంటాడు. మరి అలాంటి సినిమాకు ఆల్ రౌండ్ అడియన్స్ ఎలా వుంటారు? బాగుందని టాక్ వస్తే తప్ప రారు. కానీ రంగ్ దే అలా కాదు.
అందుకే నితిన్ అర్జెంట్ గా చెక్ ను పక్కన పెట్టి అయినా, రంగ్ దే ను ఫినిష్ చేసే దిశగా కదులుతున్నాడు. ఈవారం నుంచే రంగ్ దే సినిమా సెట్ మీదకు వెళ్తున్నాడు. ఈ సినిమా ఇఫ్పటికే 30శాతం పూర్తయింది. మరోపక్క చెక్ సినిమాకు ఇంకా 70 రోజుల వర్కింగ్ డేస్ బకాయి వున్నాయి.
అందువల్ల రంగ్ దే నే భీష్మను ఫాలో అయ్యే నితిన్ సినిమా కావచ్చు.