చిన్న సినిమా-భారీ పబ్లిసిటీ

రంగనాధ సాయి అంటే ఎవరు ఆయన అంటారు..కానీ సాయి కొర్రపాటి అంటే..ఓ ఆయనా అంటారు. ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం సీతారామరాజు సినిమాతో పంపిణీ రంగంలోకి వచ్చారు..ఆపై లాహిరి లాహిరి లాహిరితో నిర్మాణ రంగంలోకి దూకారు..ఆపై…

రంగనాధ సాయి అంటే ఎవరు ఆయన అంటారు..కానీ సాయి కొర్రపాటి అంటే..ఓ ఆయనా అంటారు. ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం సీతారామరాజు సినిమాతో పంపిణీ రంగంలోకి వచ్చారు..ఆపై లాహిరి లాహిరి లాహిరితో నిర్మాణ రంగంలోకి దూకారు..ఆపై ఇటు పంపిణీ..అటు నిర్మాణంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాలు పంచుకుంటూనే వున్నారు. కానీ వున్నట్లుంది ఈగ సినిమాతో ఎవరీయన..అని జనం దృష్టి ఆకట్టుకున్నారు. జాతీయ అవార్డు కూడా కొట్టేసారు. ఆపై బాలయ్యను నలభై కోట్ల క్లబ్ లో చేర్చిన లెజండ్ నిర్మాతగా మళ్లీ వార్తలకెక్కారు. 

ఇంతకీ విషయం ఏమిటంటే, ఇంత పెద్ద నిర్మాత ఓ చిన్న సినిమా తీయడం. అదీ కొత్త దర్శకుడితో..కొత్త నటీనటులతో. పోనీ అలా అని ఆ సినిమాను అలా చిన్నగా వదిలేసారా అంటే, అక్కడ  మళ్లీ టర్నింగ్. సినిమా ప్రచారానికి భారీ ఖర్చు. అవసరాల శ్రీనివాస్ అన్నట్లు ప్రచారంపై ఇంత దృష్టి పెట్టే నిర్మాత దొరకడం ఆయన అదృష్టం. అందుకే ఇప్పుడు వున్నట్లుండి పెద్ద సినిమాకు వచ్చే హైప్ ఊహలు గుసగుసలాడే సినిమాకు వచ్చేసింది. పైగా క్లాసిక్ విజువల్స్ మల్టీఫెక్స్, ఓవర్ సీస్ మార్కెట్  దృష్టిని ఆకట్టుకున్నాయి. 

గతంలో చాలాసార్లు చాలా మంది చెప్పారు..పెద్ద నిర్మాతలు చిన్న సినిమా తీయాలి. అప్పుడే చిన్న సినిమా బతుకుతుంది అని. తమిళనాట శంకర్, మురుగదాస్, లింగుస్వామి లాంటి డైరక్టర్లు చేసే పని అదే. ఇప్పుడు ఇక్కడ సాయి కొర్రపాటి చేసిన పని అదే. అదే పని మిగిలిన పెద్ద నిర్మాతలు, దర్శకులు చేయాలి.అప్పుడే చిన్న సినిమా బతికి బట్టకడుతుంది. కొత్త దర్శకులు, నటులు పుట్టకువస్తారు. పుట్టుకురావడం అంటే గుర్తుకు వచ్చింది. ఈ రోజు సాయి కొర్రపాటి పుట్టిన రోజు కూడా.