Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చిన్న సినిమాలకు నో సమ్మర్

చిన్న సినిమాలకు నో సమ్మర్

సమ్మర్ మొత్తం పెద్ద సినిమాలే దున్నేసేలా కనిపిస్తున్నాయి. పెద్ద సినిమాలు రెండు వారాలతో సరిపేడితే మధ్యలో చిన్న సినిమాలు విడుదలకావడం, లేదా ఆకట్టుకొవడం అనే అవకాశం వుండేది. కానీ అలా జరగేటట్లు కనిపించడం లేదు. రంగస్థలం విడుదలయి మూడు వారాలు అయినా కలెక్షన్లు ఇంకా బాగానే వున్నాయి. చాలా చోట్ల షేర్ వస్తోంది. మిగిలిన చోట్ల డెఫిసిట్ అయితే లేదు. రంగస్థలానికి భరత్ కు మధ్యలో విడుదలైన రెండు మీడియం సినిమాలు దారుణంగా దెబ్బతినేసాయి.

ఇప్పుడు భరత్ అనే నేను విడుదలయింది. ఈ సినిమా తరువాత రెండు చిన్న, మీడియం సినిమాలు వస్తున్నాయి. మరి వాటి పరిస్థితి ఎలా వుంటుందో చూడాలి. భరత్ అనే నేను విడుదలయిన రెండు వారాలకు నా పేరు సూర్య, అది వచ్చిన నాలుగు రోజులకే మహానటి సినిమాలు వస్తున్నాయి. ఇవి రెండూ భారీ సినిమాలే. అక్కడితో భారీ సినిమాలు అయిపోతున్నాయి. ఆ తరువాత మెహబూబా విడుదల వుంది.

అయితే చిన్న సినిమాలు రాజూగాడు, అమ్మమ్మగారి ఇల్లు డేట్ ల కోసం దిక్కులు చూస్తున్నాయి. 11న రాజూగాడు డేట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ముందు వెనుక ఆడతున్నారు. 4న నాపేరు సూర్య, 9న మహానటి, 11న మెహబూబా వుండగా ఆ సినిమాను వేయడమా? మానడమా? అని. దాంతో 18న వున్న టాక్సీవాలా డేట్ మీద చూస్తున్నారు. అది కూడా చిన్న సినిమానే.

ఆ డేట్ తప్పితే మళ్లీ 24, 25ల్లో నేల టికెట్, ఆఫీసర్ సినిమాలు వున్నాయి. కళ్యాణ్ రామ్ నా నువ్వే కూడా వుంది. అక్కడితో మే నెల విడుదలలు పూర్తవుతాయి. సవ్యసాచి, శ్రీనివాస కళ్యాణం, పంతం, సమ్మోహనం లాంటి సినిమాలు వున్నాయి. వీటిలో పంతం జూలైలో వుండొచ్చు. మిగిలినవి జూన్ లోనే రావచ్చు. అయితే కాలా లాంటి పెద్ద సినిమా మళ్లీ అక్కడ రెడీగా వుంది.

నాపేరు సూర్య, మహానటి కూడా రంగస్థలం, భరత్ అనే నేను రేంజ్ టాక్ తెచ్చుకుంటే మళ్లీ చాలా సినిమాల డేట్ లు మారే అవకాశం వుంది. మొత్తంగా చూసుకుంటే ఈ సమ్మర్ ను పెద్ద సినిమాలే ఏలేలా కనిపిస్తున్నాయి. పోస్ట్ సమ్మర్ అంత ఆశాజనకంగా వుండదు. ముఖ్యంగా చిన్న సినిమాలకు అస్సలు పనికిరాదు.

టోటల్ గా చూసుకుంటే చిన్న సినిమాలకు బ్యాడ్ సీజన్ నడుస్తున్నట్లుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?