చిరంజీవి ది మేకప్ నే

ఉన్నట్లుండి మెగాస్టార్ చిరంజీవి గుండులుక్ తో కనిపించేసరికి జనాలకు ఒకటే క్యూరియాసిటీ. ఏమిటి సంగతి? ఏ సినిమా కోసం ఈ మేకప్ టెస్ట్. అసలు నిజం గుండునా? మేకప్ నా? ఆచార్య సినిమా షూటింగ్…

ఉన్నట్లుండి మెగాస్టార్ చిరంజీవి గుండులుక్ తో కనిపించేసరికి జనాలకు ఒకటే క్యూరియాసిటీ. ఏమిటి సంగతి? ఏ సినిమా కోసం ఈ మేకప్ టెస్ట్. అసలు నిజం గుండునా? మేకప్ నా? ఆచార్య సినిమా షూటింగ్ వుండగా ఇలా గుండు చేయించుకుంటే ఎలా? అసలు ఏమై వుంటుంది? ఇలా ఎన్నో డవుట్లు.

వీటన్నింటికీ క్లారిటీ వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి చాలా సరదాగా ఈ గుండు గెటప్ ట్రయ్ చేసినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం చేసే ఓ మేకప్ ను ఆయన ట్రయ్ చేసినట్లు బోగట్టా. నిజానికి స్టిల్ ఇప్పుడు బయటకు వదిలినా, ఈ మేకప్ చేసుకున్నది మాత్రం కొన్ని రోజులు కిందటే అని బోగట్టా.

హీరో నాగార్జున బిగ్ బాస్ కోసం ఓల్డ్ గెటప్ ట్రయ్ చేసారు. దాని కోసం ప్రత్యేకంగా మేకప్ చేయించుకున్నారు. ఈ సంగతి తెలిసి మెగాస్టార్ కూడా అదే నిపుణులతో ఈ గుండు గెటప్ ను సరదాగా ట్రయ్ చేసినట్లు తెలుస్తోంది. అంతకన్నా ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదని మెగాస్టార్ సన్నిహిత వర్గాల బోగట్టా.

రైతుల్ని భ్రమల్లోనే ఉంచుతున్న బాబు