కేటీఆర్ కు సారీ చెప్పిన చిరంజీవి

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కు మెగాస్టార్ చిరంజీవి క్షమాపణలు చెప్పారు. ఇదేదో సరదాకు చెప్పింది కాదు, కాస్త సీరియస్ గానే సారీ చెప్పారు చిరు. ప్రపంచ తెలుగు మహాసభల్లో ఈ సంఘటన జరిగింది.…

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కు మెగాస్టార్ చిరంజీవి క్షమాపణలు చెప్పారు. ఇదేదో సరదాకు చెప్పింది కాదు, కాస్త సీరియస్ గానే సారీ చెప్పారు చిరు. ప్రపంచ తెలుగు మహాసభల్లో ఈ సంఘటన జరిగింది.

“కేటీఆర్ గారికి ఈమధ్య ఓ పెద్ద అవార్డు వచ్చింది. దానికి సంబంధించి ఆయన్ను నేను అభినందించాను. అలవాటుగా ఇంగ్లీష్ లో విష్ చేశాను. తెలుగుకు సంబంధించిన కార్యక్రమానికి ఆహ్వానిస్తే ఇంగ్లీష్ లో మాట్లాడ్డం ఎంతవరకు కరెక్ట్ అని కేటీఆర్ నన్ను ప్రశ్నించారు. కేటీఆర్ సరదాగా అని ఉండొచ్చు. కానీ నాకు మాత్రం ఒక్క క్షణం మనసులో చివుక్కుమనిపించింది. వెంటనే సారీ కేటీఆర్ అనేశా. కేటీఆర్ తమాషా చేసినా దాని వెనక సత్యాన్ని గుర్తించాను.” అన్నారు చిరంజీవి.

ఇద్దరు తెలుగు వాళ్లు మాట్లాడుకునేటప్పుడు మధ్యలో ఇంగ్లీష్ రావడం బాధాకరం అన్నారు చిరంజీవి. సౌకర్యం కోసమో, ఫ్యాషన్ కోసమో ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారని.. దానివల్ల తెలుగు మరుగున పడిపోతోందని అన్నారు.

ప్రపంచ తెలుగు మహాసభల్లో జరిగిన కార్యక్రమంలో చిరంజీవితో పాటు నాగార్జున, వెంకటేశ్, రాజమౌళి, కృష్ణ, రాజేంద్రప్రసాద్, మోహన్ బాబు, బ్రహ్మానందం లాంటి సినీప్రముఖులు పాల్గొన్నారు. వీళ్లలో కొంతమంది అచ్చ తెలుగులో మాట్లాడ్డానికి ఇబ్బంది పడ్డారు.