Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చిరు యవ్వారం మొదటికి వచ్చిందా?

చిరు యవ్వారం మొదటికి వచ్చిందా?

మెగాస్టార్ చిరంజీవికి మహా సరదాగా వుంది ఎలాగైనా మళ్లీ కెమేరా ముందుకు రావాలని. అభిమానులకు అలాగే వుంది. తమ స్టార్ ను తెరపై మళ్లీ చూడాలని. 150వ సినిమా అనుకుంటే కథ కుదరలేదు. సర్లే, కనీసం కొడుకు రామ్ చరణ్ సినిమాలో నైనా నటించి,అభిమానులను అలరిద్దాం అనుకుంటే సరైన జోడీ సెట్ కావడం లేదు.

ఇలియానా అనుకున్నారు. రేటు ఎక్కువ అన్నారు. నిజానికి రేటు పెద్ద సమస్య కాదు. ముఫై కోట్ల బడ్జెట్ తో తయారువుతున్న సినిమా దగ్గర కోటి ఎక్కువేమిటి? కానీ ఇలియానాను జనం మరిచిపోయి చాలా కాలం అయింది.

ఇప్పుడు లేటెస్ట్ ఎవరు అన్నదే అసలు సమస్య అని తెలియవస్తోంది అందుకే తమన్నా అన్నారు. తమన్నాకు కూడా స్పెషల్ సాంగ్స్ చేయడం అలవాటే కదా అని. కానీ ఇప్పుడు ఆమె కూడా కుదరలేదని తేలిపోయినట్లే.

ఇప్పుడు మరెవరు? ఇక్కడ చిన్న మెలిక వుంది. సాధారణంగా ఇలాంటి స్పెషల్ పాటలు ఎవరు చేస్తారు? చిన్న మీడియం రేంజ్ అమ్మాయిలు. బడా హీరోయిన్లు అయితే తరువాత సినిమాలో హీరోయిన్ చాన్స్ ఇస్తామంటే, సరే అని వస్తారు. కానీ ఇప్పుడు అలా ఎవర్ని అయినా తేవాలి అంటే, రామ్ చరణ్ పక్కన తరువాతి చాన్స్ ఆఫర్ చేయాలి.

చిరుపక్కన చిందేసాక, రామ్ చరణ్ పక్కన హీరోయిన్ అంటే అంత బాగోదు. ఇలా చాన్స్ అడగని వారు, కాస్త పేరున్న అమ్మాయిలు ఎవరు అని గాలిస్తున్నారు. ఇన్నాళ్లూ 150 వ సినిమా కథ కోసం గాలింపు,. ఇప్పుడు గెస్ట్ రోల్ పక్కన అమ్మాయి కోసం గాలింపు. బాగానే వుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?