చిరు..కత్తి పడతారా? పట్టరా?

మురగదాస్ కత్తి సినిమా తెలుగులో ఎక్కని సినిమా ఆఫీసులేదు..దిగని హీరో ఇల్లు లేదు. నెలకో డైరక్టర్, పక్షానికి హీరో పేరు వినిపిస్తూ, ఇప్పుడు వివి వినాయక్, చిరంజీవి ల దగ్గర ఆగింది. అయితే ఇక్కడా…

మురగదాస్ కత్తి సినిమా తెలుగులో ఎక్కని సినిమా ఆఫీసులేదు..దిగని హీరో ఇల్లు లేదు. నెలకో డైరక్టర్, పక్షానికి హీరో పేరు వినిపిస్తూ, ఇప్పుడు వివి వినాయక్, చిరంజీవి ల దగ్గర ఆగింది. అయితే ఇక్కడా మెటీరియలైజ్ అవుతుందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒకటి ఇందులో యంగ్ క్యారెక్టర్ కూడా లెక్క ప్రకారం చిరంజీవే పోషించాలి. కానీ తన లుక్ సరిపోతుందా అని అనుమానంలో వున్నారట. అలా అని మరో యంగ్ హీరోను పెట్టుకుంటే, తన పాత్రను డామినేట్ చేసేస్తుందేమో?  కాదూ అంటే చరణ్ ను మాత్రమే తీసుకోవాలి. అందువల్ల సినిమానే వదిలేస్తే బెటరా అన్నది పునరాలోచనగా వినిపిస్తోంది.

మరోపక్క ప్రస్తుతానికి మెగా కుటుంబానికి చంద్రబాబుతో మంచి సంబంధాలే వున్నాయి. పవన్ అంటే బాబుగారికి ఎంత అభిమానం. అలాగే చరణ్ అత్తగారి సంస్థ అయిన అపోలో అన్నా బాబుగారికి ఇష్టమే. ఇటీవలే దానికి ఓ ఆసుపత్రి అప్పగించేసారు.

ఇలాంటి నేపథ్యంలో కోరి సెజ్ లు, భూములు, లాక్కోవడాలు అన్నీ కెలకడం అవసరమా? లేదా కథను రాజధాని నేపథ్యంలోకి తీసుకుని ముందుకు వెళ్లడమా? అలా వెళ్తే, పవన్ రాజధాని రైతులకు అండగా నిలవలేదు..అదిగో అన్న చిరంజీవే రాజధాని వ్యవహారాలను విమర్శించాడు అన్న టాక్ వస్తుంది.

అందువల్ల శుభ్రంగా ఓ కమర్షియల్ సినిమా చేసుకుంటే బెటర్ అన్న ఆలోచన కూడా డిస్కషన్లో వుందట మెగా స్టార్ శిబిరంలో.