Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చిత్ర-లహరి-తేజ్

చిత్ర-లహరి-తేజ్

చిత్రలహరి అనే సబ్జెక్ట్ ను నాని కోసం తయారుచేయించి, ఆయన కాదు అనడంతో సాయిధరమ్ తేజ్ తో ఫిక్సయింది మైత్రీ మూవీస్. నాని నో అనడానికి కారణం, తాను గతంలో చేసిన ఓ సినిమా ఛాయలు కథలో వుండడమే అని అప్పట్లో వినిపించింది.

ఆ తరువాత చిత్రలహరి అన్నది ఆ సినిమాలో వుండే బార్ పేరు అని, అందుకే ఆ టైటిల్ ఫిక్స్ చేసారని, కథలో ఆ బార్ కు ప్రాధాన్యత వుందని వినిపించింది. ఈ మధ్య చిత్రలహరి కథ విన్న మెగాస్టార్, తండ్రి కొడుకుల ఎమోషనల్ లీడ్ వుండడం గమనించి విజేత కథ మాదిరిగా వుందని అభిప్రాయపడ్డారని గుసగుసలు వినిపించాయి.

ఇప్పుడు మరో లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది బయటకు. చిత్రలహరి అన్నది సినిమాలో బార్ పేరు మాత్రమే కాదట. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు. ఒకరి పేరు చిత్ర. మరొకరి పేరు లహరి. ఈ ఇద్దరు అక్క చెల్లెళ్లు కాదు. ఫ్రెండ్స్. వీరిలో ఒకరిని హీరో ప్రేమిస్తాడు. మరొకరు హీరోను ప్రేమిస్తారు. కథలో ఇదో థ్రెడ్. ఈ రెండుపాత్రల్లో ఒకదానికి ఇప్పటికే నివేధా థామస్ ను ఓకె చేసారు. మరో హీరోయిన్ ను ఎంపిక చేయాల్సి వుంది.

తేజ్ కాస్త శరీరం తగ్గించుకుని రాగానే ఈ సినిమా స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?