జయసుధ కుమారుడు చిత్ర నిర్మాణ రంగంలోకి దిగుతున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ మీడియం రేంజ్ సినిమా నిర్మించాలని తలపెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఎల్ బి డబ్ల్యులో నటించిన ఓ నటుడిని హీరోగా ఎంపిక చేసుకున్నట్లు బోగట్టా. మిగిలిన వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.
Advertisement
జయసుధ కూడా నేరుగా కాకున్నా, సమర్పణ వంటి వ్యవహారాలతో ఒకటి రెండు సినిమాల ద్వారా నిర్మాణంతో అనుబంధం కలిగి వున్నారు. ఇప్పుడు జయసుధ తనయుడు మాత్రం నేరుగా నిర్మాణ రంగంలోకి వస్తున్నారు. ఎక్కవ మంది కొత్తవారు, కొంత మంది సీనియర్ల కలయికగా వుంటుందీ సినిమా.