సినిమా స్టిల్ నా? ఫొటో షూట్ నా?

అన్ని అంతస్తుల భవనం. బయట, పోషే,  రోల్స్ రాయస్ లాంటి ఖరీదైన కారు. కానీ అక్కడే సూటు వేసుకుని, స్టూలు మీద కూర్చుని, ఫ్యాట్ ఓ కాలు మడతపెట్టి, బీడీ వెలిగిస్తూ హీరో. ఇదీ…

అన్ని అంతస్తుల భవనం. బయట, పోషే,  రోల్స్ రాయస్ లాంటి ఖరీదైన కారు. కానీ అక్కడే సూటు వేసుకుని, స్టూలు మీద కూర్చుని, ఫ్యాట్ ఓ కాలు మడతపెట్టి, బీడీ వెలిగిస్తూ హీరో. ఇదీ అల్లు అర్జున్-త్రివిక్రమ్ కలిసి చేస్తున్న అల వైకుంఠపురములో సినిమా ఫస్ట్ లుక్. 

అత్తారింటికి దారేది లో మల్టీమిలియనీర్ హీరో అత్త ఇంట్లో డ్రయివర్ గా కనిపిస్తాడు. అల వైకుంఠపురములో హీరో పక్కా మిడిల్ క్లాస్. ఖరీదైన అత్త (?) టబు ఇంట్లో చేరినట్లు కనిపిస్తోంది చూస్తుంటే. ఎలా చేరాడు? అన్నది సినిమా చూస్తే కానీ తెలియకపోవచ్చు. కానీ గెటప్, సెటప్ చూస్తుంటే మళ్లీ డ్రయివర్ అనే అనిపిస్తోంది. 

ఆ విషయం ఎలా వున్నా, మళ్లీ త్రివిక్రమ్ సత్యమూర్తి, అత్తారింటిది దారేది సినిమాల స్టయిల్ లోనే మళ్లీ బన్నీతో సినిమా చేస్తున్నారా? త్రివిక్రమ్ అనే అనుమానం కలిగేలా ఫస్ట్ లుక్ ఎందుకు ఇచ్చారన్నదే సందేహంగా వుంది. బన్నీ లాంటి స్టయిలిష్ హీరో స్టయిలిష్ లుక్ వదలకుండా స్టోరీలైన్ గురించి ఆలోచన రేకెత్తించేలా ఫస్ట్ లుక్ ఇచ్చారు. దాని వెనుక త్రివిక్రమ్ స్ట్రాటజీ ఏమై వుంటుందో మరి?

ఇదే ఆరా తీస్తే, అసలు అంత సీన్ లేదని, ఇదంతా ఫస్ట్ లుక్ ఇవ్వడం కోసం చేసిన ఫొటో షూట్ అని ఆన్సర్ వస్తోంది. కానీ మరీ ఫస్ట్ లుక్ గా ఫోటో షూట్ చేసి, ప్రేక్షకులను తప్పుదారి పట్టించే ప్రయత్నం త్రివిక్రమ్ చేస్తారా? అన్నదే అసలు సిసలు అనుమానం.

మహేష్ బాబు-అనిల్ రావిపూడి లాంటి కాంబినేషన్ ను ఢీకొని సంక్రాంతి బరిలో గెలవాల్సి వుంది ఈ సినిమా. మరి అందుకు త్రివిక్రమ్ తన వంతుగా ఏం చేయబోతున్నారో?