Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సినిమా హీరోల బాధ్యతారాహిత్యం

సినిమా హీరోల బాధ్యతారాహిత్యం

ఎవడో వస్తాడు..2 కే రన్, 5 కే రన్ అంటారు. దానికి హీరోలు వస్తారు. హీరోయిన్లు వస్తారు. దాని వెనుక కనిపంచని మతలబులు వుంటాయి. అయితే చుట్టురికాలు, స్నేహాలు లేదా ఆర్థిక లావాదేవీలు దాగుంటాయి. 

అదే సామాన్యులు ఎవరైనా ఓ అత్యాచారఘటనకు వ్యతిరేకంగా ర్యాలీ అంటే ఒక్క హీరో రాడు. పోనీ హీరో అన్నా స్వంతంగా ఈ పనికి పూనుకోరు. అందరికీ సులువుగా, పది పైసలు ఖర్చు లేకుండా, పది నిమషాలు టైమ్ వేస్ట్ లేకుండా పని జరిగిపోవడానికి ట్విట్టర్ వుంది. దాంట్లో మాత్రం స్పందించేస్తారు. 

హీరోలు సిన్మాల్లోనే కానీ, నిజ జీవితంలో హీరోల్లా అస్సలు వుండరని తెలుగు హీరోల మీద భయంకరమైన విమర్శ వుంది. తెలుగు హీరోలు ఆ మాటలు నిజం చేస్తూ వస్తున్నారు తప్ప, పోగొట్టుకోవడానికి చూడడం లేదు. సందేశాలు సినిమాల్లోనే కానీ వాస్తవ జీవితం లో అస్సలు కనిపించడం లేదు. వినిపించడం లేదు.

ఇటీవల శంషాబాద్ సమీపంలో జరిగిన అత్యాచార ఘటనపై జాతీయ స్థాయిలో ఆవేదనలు, ఆగ్రహాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ తెలుగు హీరోలు ట్విట్టర్ తోనే సరిపెట్టేస్తున్నారు.

మెగాస్టార్ ఓ విడియో వదిలేసి చేతుల దులుపుకున్నారు. బయటకు వచ్చి జనంతో ఓ ర్యాలీనో, ఓ సంతాప ప్రదర్శనో చేసి, జనాల్లో కాస్త చైతన్యం, అవగాహన రేకెత్తించే ఆలోచనలు అస్సలు చేయడం లేదు.

అదే తమ సినిమాల ప్రమోషన్ కోసం అయితే మాత్రం కాలేజీలకు తిరిగి డ్యాన్స్ లు చేస్తారు.ఇప్పుడు ఈ సమస్య మీద కాలేజీలకు తిరిగి, కుర్రాళ్లకు మంచిమాటలు నాలుగు చెప్పవచ్చుగా? అబ్బే అలాంటి ఆలోచనలే లేవు. 

'మా' మరీనూ

ఒక పక్క అత్యాచార ఘటనతో అందరూ ఉలిక్కిపడి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సినిమాల ఓపెనింగ్స్ పక్కన పెట్టారు. కానీ తెలుగు నటీనటుల సంఘ 'మా' మాత్రం పక్కాగా ఎంజాయ్ చేస్తూ పిక్ నిక్ చేసుకుంది. కామెడీ స్కిట్ లతో హడావుడి చేసుకుంది. ఎవరన్నా ఏమైనా అంటారేమో అని, అత్యాచార బాధితురాలి ఫోటో పెట్టి, దండవేసి, తమ నవ్వులు, కేరింతలు తాము చూసుకున్నారు.

మొత్తం మరోసారి జనాల టికెట్ డబ్బులతో కోట్లకు కోట్లు ఆర్జిస్తున్న సినిమా జనాలు, హీరోల బాధ్యత అన్నది మరోసారి ప్రశ్నార్థకమైంది. సోషల్ మీడియాలో విమర్శలకు గురి అవుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?