అనగనగా ఓ హీరో సినిమాలు చకచకా చేస్తున్నారు. కానీ సక్సెస్ రేట్ మాత్రం తక్కువగా వుంది. అయినా సినిమాలు వస్తున్నాయి అంటే వెనుక వున్న దన్ను అలాంటిది అని ఇండస్ట్రీ గుసగుస. అయితే ఇదిలా వుంటే ఆ మధ్య ఈ హీరో సినిమా ఒకటి విడుదలైంది. దాని హక్కులు తీసుకోమంటే సరైన రెస్పాన్స్ రాలేదట.
దాంతో హీరోకు, వెనుక వున్న బ్యాక్ గ్రవుండ్ కు సన్నిహితుడైన ఓ డిస్ట్రిబ్యూటర్ కు తీసుకోమని అడిగారట. అక్కడితో ఆగకుండా, ఒకవేళ సినిమా అడకపోయి, పెట్టిన పెట్టుబడి వెనక్కు రాకపోతే, రాజధాని ప్రాంతంలో రోడ్ల కాంట్రాక్టు ఆయనకు కానీ, ఆయన చెప్పినవారికి కానీ ఇస్తామని హామీ ఇచ్చారట. దాంతో తప్పలేదట.
ఇప్పుడు ఆ హీరోతో సినిమాలు చేస్తున్నవారో, చేయాలనుకుంటున్న వారో ఇలాంటి తెర వెనుక వ్యవహారాలు వుండడం వల్లే ముందుకు వస్తున్నారని వినికిడి.ఇదిలా వుంటే ఆ హీరో బంధువైన మరో హీరో నటించిన భారీ సినిమా కూడా ఆ మధ్య విడుదలైనపుడు కూడా ఇలాంటి హామీనే ఇచ్చి ఓ ఏరియా కొనిపించారని వదంతి వినిపిస్తోంది.