సినిమాల్లోకి దిల్ రాజు మనవడు

ఇప్పటి వరకు దిల్ రాజు అంటే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబీటర్ మాత్రమే. ఇకపై బుల్లి హీరోగారి తాతగారు అని కూడా చెప్పుకోవచ్చేమో? ఎందుకంటే దిల్ రాజు మనవడు కూడా సినిమాల్లోకి వచ్చేసాడు. దిల్ రాజు…

ఇప్పటి వరకు దిల్ రాజు అంటే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబీటర్ మాత్రమే. ఇకపై బుల్లి హీరోగారి తాతగారు అని కూడా చెప్పుకోవచ్చేమో? ఎందుకంటే దిల్ రాజు మనవడు కూడా సినిమాల్లోకి వచ్చేసాడు. దిల్ రాజు కుమార్తె కొడుకు ఆరాన్ష్ ఓ సినిమాలో కాస్త ఎక్కువ సేపే కనిపించే పాత్రలో కనిపించబోతున్నాడు.

ఆరాన్ష్ వయస్సు ఏడాది. దిల్ రాజుకు ఏకైక మనవడు. వారసుడు అన్నీ ఈ బుడ్డోడే. అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించే సినిమాలో ఓ చిన్నపిల్లాడి పాత్ర వుంది. దాదాపు పదిహేను నిమిషాలకు పైనే వుంటుందని తెలుస్తోంది.

ఇప్పటికే అనేకసార్లు ఆరాన్ష్ ను చూసిన వెంకీ అట్లూరి ఆ పాత్రకోసం దిల్ రాజును అడిగాడు. ఆయన మనవడితో వేయిస్తా అని. ఆయన ఒకె అనేసారు. దాంతో ఏడాది వయసులోనే ఆరాన్ష్ సినిమాల్లోకి వచ్చేసాడు.