సినిమాలు వుంటాయా? వాయిదా పడతాయా?

మోడీ నోట్ల రద్దు నిర్ణయంతో టాలీవుడ్ కిందా మీదా అవుతోంది. ముఖ్యంగా ఈవారం రెండు సినిమాలు విడుదల వున్నాయి. ఇంట్లో దెయ్యం నాకేం భయం, సాహసం శ్వాసగా సాగిపో సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి.…

మోడీ నోట్ల రద్దు నిర్ణయంతో టాలీవుడ్ కిందా మీదా అవుతోంది. ముఖ్యంగా ఈవారం రెండు సినిమాలు విడుదల వున్నాయి. ఇంట్లో దెయ్యం నాకేం భయం, సాహసం శ్వాసగా సాగిపో సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాలు విడుదల వుంటుందా అన్నది అనుమానంగా వుంది. 

ఎందుకంటే బయ్యర్లు తెచ్చి డబ్బులు కట్టేది సగం వరకు బ్లాక్ లోనే. ఇప్పుడు తెచ్చేపరిస్థితి లేదు. తీసుకునే పరిస్థితి లేదు. అదీ కాక, టికెట్ కౌంటర్ లో 500 నోటు ఇస్తే తీసుకునే పరిస్థితి లేదు. ఇవన్నీ కలిపి చాలా చాలా సమస్యలకు దారి తీస్తాయి. అందువల్ల ఈవారం సినిమాలు వుంటాయా? అన్నది అనుమానంగా వుంది.

నిజానికి ఇంట్లో దెయ్యం సినిమాకు పెద్ద సమస్య వుండదు. ఎందుకంటే మీడియం సినిమా. చాలా వరకు డైరెక్ట్ రిలీజ్. అందువల్ల బ్లాక్ సమస్య వుండదు. కానీ జనాలు థియేటర్ కు డబ్బులు తేవడం అన్నది చూడాలి. కానీ సాహసం సంగతి అలా కాదు. ఇరవై కోట్ల సినిమా. బయ్యర్లు ఏ మేరకు డబ్బులు కట్టారో తెలియదు. 

ఈ విషయమై ఇంట్లో దెయ్యం నిర్మాత భోగవిల్లి ప్రసాద్ తో మాట్లాడితే, జనం పల్స్ ఇంకా తెలియడం లేదని, జనం సినిమా చూసే మూడ్ లో వున్నారా, ఈ పరిస్థితి ఏమిటి అన్నది ఆరా తీస్తున్నామని, రేపు నిర్ణయం తీసుకుంటామని అన్నారు.