ఇదేంటి బాబోయ్.. వరల్డ్ పవనిజం డే అంట!

సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో నిన్న పవన్ అభిమానులు తెగ సెలబ్రేట్ చేసుకున్నారు. దీన్ని టీవీ చానళ్లు కూడా అందిపుచ్చుకున్నాయి. కాసేపు పవన్ కల్యాణ్ గురించి ప్రోగ్రామ్స్ వేసి టైంపాస్ చేశాయి. అక్టోబర్ 11…

సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో నిన్న పవన్ అభిమానులు తెగ సెలబ్రేట్ చేసుకున్నారు. దీన్ని టీవీ చానళ్లు కూడా అందిపుచ్చుకున్నాయి. కాసేపు పవన్ కల్యాణ్ గురించి ప్రోగ్రామ్స్ వేసి టైంపాస్ చేశాయి. అక్టోబర్ 11 ని వరల్డ్ పవనిజం డే అంటూ సెలబ్రేట్ చేశారు పవన్ కల్యాణ్ అభిమానులు. ఎందుకలా.. అంటే, 19 ఏళ్ల క్రితం పవన్ కల్యాణ్ తొలి సినిమా ఇదే రోజున విడుదల అయ్యింది కాబట్టి.. ఈ రోజును సెలబ్రేట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. 

అయితే పవన్ ఫ్యాన్స్ కు ఏమో కానీ… ఇతరులకు, సామాన్యులకు మాత్రం ఈ సెలబ్రేషన్స్ అంతుబట్టడం లేదు. సినిమా హీరోల్లో పవన్ కల్యాణ్ ఫస్టూ కాదు, లాస్టూ కాదు. ఎంతోమంది మహామహానటులు, హీరోలు ఉన్నారు. వాళ్ల ఆరంగేట్రాలకు సంబంధించిన సెలబ్రేషన్సూ జరుగుతూ ఉంటాయి. చిరంజీవి ముప్పై ఏళ్ల కెరీర్ ను పూర్తి చేసుకున్నాడనో.. మోహన్ బాబు నాలుగో దశకాన్ని పూర్తి చేసుకున్నాడనో… అంతకన్నా ముందే ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి లెజెండరీల విషయంలో కూడా వారి తొలి సినిమా విడుదల అయినా తేదీల ఆధారంగా అభిమానులు, మీడియా ప్రత్యేక సంబరాలు, ప్రత్యేక వార్తా కథనాలు ఇవ్వడం జరిగుతూ వస్తోంది. అంతే కానీ.. ఇలా వరల్డ్ డేలు ప్రకటించుకోవడం మాత్రం జరగలేదు. ఎంతైనా పవన్ కల్యాణ్ అభిమానులు రూటే సపరేట్ కదా! అందుకే రాష్ట్రం దాటితే ఎవరికీ తెలీని వ్యక్తిని వరల్డ్ వైడ్ సెలబ్రిటీగా మార్చుకున్నారు.

అయినా.. కరెన్సీ నోటు మీద గాంధీ బదులుగా పవన్ కల్యాణ్ బొమ్మ పెట్టాలనే డిమాండ్ ను, ఆయనది ఆ స్థాయి అని అనుకునే వారు ఇలా “వరల్డ్ పవనిజం'' డే జరపడం పెద్ద విశేషం కాదు కదా! మరి ఈ విషయంపై ఏమైనా స్పందించేది ఉంటే… పవన్ ఫ్యాన్స్ గురించి బాగా తెలిసిన రామ్ గోపాల్ వర్మ వంటి వారే స్పందించాలి!