ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు పవన్ కల్యాణ్. సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలతో పాటు తేలికైన కొన్ని యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ షెడ్యూల్ కోసం రోజుకు 12 గంటలు కష్టపడుతున్నాడట పవన్ కల్యాణ్. కేవలం ఈ షెడ్యూల్ కు మాత్రమే కాదు, టోటల్ సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు ఇలానే రోజుకు 12 గంటలు కష్టపడాలని డిసైడ్ అయ్యాడట.
పవన్-త్రివిక్రమ్ సినిమాను ఆగస్ట్ 11న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వీకెండ్ తో పాటు పంద్రాగస్ట్ వేడుక కూడా కలిసొస్తుంది కాబట్టి కలెక్షన్లను ఢోకా ఉండదనేది యూనిట్ ఆలోచన. అందుకే సినిమా షూటింగ్ ను ఎట్టి పరిస్థితుల్లో జులై మొదటి వారానికి పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. సో.. ప్రస్తుతం యూనిట్ కు ఉన్నది కేవలం 3 నెలల టైం మాత్రమే.
పవన్ తో సినిమాను 3 నెలల్లో పూర్తిచేయాలంటే అది కత్తి మీద సామే. అందుకే పవన్ తో లాంగ్ కాల్షీట్లు ప్లాన్ చేశాడట త్రివిక్రమ్. తన క్లోజ్ ఫ్రెండ్ అడగడంతో పవన్ కూడా కాస్త స్పీడ్ పెంచి, రోజుకు 12 గంటలు కష్టపడుతున్నాడట. రెగ్యులర్ గా తీసుకునే ఎమౌంట్ కంటే కాస్త ఎక్కువ మొత్తాన్ని పవన్ కు పారితోషికంగా ఇవ్వడానికి ఈ లాంగ్ కాల్షీట్లే కారణమని తెలుస్తోంది.