దాసరే రాస్తే పోలా?

రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు పేరులోంచి నాయుడు పేరు తీసేసారని పాపం, దర్శకరత్న దాసరి తెగ బాధపడ్డారు. అదేంటో సినిమా వాళ్లంతా ఇంతే. సినిమాల్లో పేదగొప్ప తేడాల్లేవంటారు..మతాలన్నీ సమ్మతమే అంటారు. కులాల గోడలు కూల్చండి…

రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు పేరులోంచి నాయుడు పేరు తీసేసారని పాపం, దర్శకరత్న దాసరి తెగ బాధపడ్డారు. అదేంటో సినిమా వాళ్లంతా ఇంతే. సినిమాల్లో పేదగొప్ప తేడాల్లేవంటారు..మతాలన్నీ సమ్మతమే అంటారు. కులాల గోడలు కూల్చండి అంటారు. కానీ వాళ్లు మాత్రం కులాల ఈక్వేషన్లను నిద్రలో కూడా మరిచిపోరు. 

బిఎన్ రెడ్డి, కెవి రెడ్టి అంటూ తోకలతో కలిసి వుండగా లేంది..ఈ నాయుడు కేమొచ్చ అన్నది దాసరి ప్రశ్న.  ఇంతకీ అవార్డు రఘుపతి వెంకయ్య ప్రతిభను బట్టా…ఆయన పేరు చివర వున్న నాయుడు బట్టా?  తెలుగు సినిమా రంగంలో వున్నంత కుల పిచ్చ ఈ దేశంలోని మరే రంగంలోనూ లేదని అందరికీ తెలిసిందే రాను రాను అది మరింత ముదురుతోంది కానీ, తగ్గడం లేదు. ఇక్కడ అవకాశాలు కూడా కులాల్ని బట్టే వుంటాయి. వాడ్నెందుకు పెట్టుకన్నావ్..మనోడున్నాడుగా అని ఫోన్ రికమెండేషన్లతో ఇక్కడ సినిమా అవకాశాలు వెదుక్కుంటూ వస్తాయి. 

ముఖ్యంగా చిత్ర సీమలో దాసరి తరువాత ఓ సామాజిక వర్గానికి అవకాశాలు పెరిగాయని, ఆ విధంగా ఆయన పెద్ద దిక్కు అయ్యారని అంటుంటారు.ఇప్పుడేమో అయన చిత్ర సీమ చరిత్ర తిరగరాయాయలని, దీన్ని వక్రీకరించేసారని వాపోతున్నారు. మరెందుకు ఎలాగూ ఖాళీగా వున్నారు కనుక, మాంచి చేయితిరిగిన రచయిత కనుక, ఆ పని ఆయనే చేస్తే పోలా?.​