గ్రీకువీరుడు దెబ్బతో మూలకు వెళ్లిపోయాడు దర్శకుడు దశరథ్. నిజానికి మాంచి ఫ్యామిలీ సినిమాలు తీసే సత్తా వున్నవాడే. కానీ ఏం లాభం కాలం కలిసిరాలేదు. ఇప్పుడు నడుస్తున్నది ఫ్యామిలీ సినిమాల సీజన్. అందరు హీరోలు అటే వెళ్తున్నారు. కానీ ఎప్పటి నుంచో ఫ్యామిలీ సినిమాలు చేస్తూవస్తున్నవాడు వెంకటేష్.
Advertisement
ఆయన కూడా మాంచి ఫ్యామిలీ సినిమా చేయాలనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు దశరథ్ అక్కడ తేలారు. మాంచి లైన్ చెప్పారని, ఓకె అయిందని, కథా విస్తరణ జరిగాక, వెంకీ కాస్త ఖాళీ అయ్యాక, సురేష్ బ్యానర్ పై తెరకెక్కుతుందీ సినిమా. దీంతో మళ్లీ ట్రాక్ మీదకు వస్తారేమో దశరథ్.