Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

డేట్ లు కావలెను

డేట్ లు కావలెను

బాహుబలి ప్రభాస్ సాహో డేట్ వచ్చేసింది. ఆగస్టు 30న విడుదల అని ప్రకటించేసారు. ఈసారి మరి వాయిదాకు ఆస్కారం లేదు. ఎందుకంటే ఒకసారి వాయిదా అంటే ఒకె కానీ మరోసారి వాయిదా అంటే డ్యామేజ్ గట్టిగా వుంటుంది. ఆ సంగతి అలా వుంచితే సాహో సినిమా డేట్ ఇలా అర్థాంతరంగా ప్రకటించడంతో చాలా సినిమాలు ఇబ్బందుల్లో పడుతున్నాయి.

నాని-విక్రమ్ కుమార్ ల గ్యాంగ్ లీడర్ సినిమాను ఆగస్టు 30న అని ఇప్పటికే ప్రకటించారు. ఫస్ట్ లుక్, ఓ పాట కూడా విడుదల చేసారు. కానీ ఇప్పుడు దానికి మరో డేట్ చూడాలి. సాహో నిర్మాత యువి వంశీ స్వయంగా హీరో నానికి ఫోన్ చేసి, సాహో తప్పనిసరిగా 30కి రావాల్సిన అగత్యం గురించి వివరించినట్లు తెలుస్తుంది. దాంతో ఇప్పుడు తప్పనిసరిగా గ్యాంగ్ లీడర్ మరో డేట్ చూసుకోవాలి.

హరీష్ శంకర్ డైరక్షన్ లో తయారవుతున్న వాల్మీకి సినిమాను సెప్టెంబర్ మొదటివారంలో విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు దానికి కూడా మరో డేట్ అవసరం పడుతుంది. సాహో వచ్చిన వన్ వీక్ కే విడుదల చేస్తారో? వారం వెనక్కు జరుగుతారో చూడాలి.

సెప్టెంబర్ నెల సినిమాలకు అంత ఫావరబుల్ కాదు. ఎందుకంటే దసరా సెలవుల ముందు క్వార్టర్లీ పరీక్షలు వుంటాయి. వర్షాకాలం కూడా. అందువల్ల మరి గ్యాంగ్ లీడర్, వాల్మీకి సినిమాలను సెప్టెంబర్ 13కు, ఆ తరువాత వేస్తారో? లేక దసరా తరువాతకు వెళ్తారో చూడాలి. అక్టోబర్ 2కు సైరా విడుదల వుంది. దానికన్నా ఓవారం ముందువేసి, దసరా సెలవులను పంచుకునే ఆలోచనలో గ్యాంగ్ లీడర్ వున్నట్లు తెలుస్తోంది.

పూరి ఇంటర్వ్యూలో చెప్పినట్లే సినిమా ఉందా?

అమలాపాల్ తన బాయ్ ఫ్రెండ్ గురించి ఇలా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?