డే వన్ నుంచే మొదలెట్టేసారు

స్టార్ట్ కాక..కాక..ఆఖరికి స్టార్ట్ అయింది మెగాస్టార్ 150 వ సినిమా. మారతున్న ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో భాగంగా, ప్రచారం మీద కూడా మెగాస్టార్ బాగా దృష్టి పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. తెగ హడావుడి చేస్తున్నారు. తొలిరోజే…

స్టార్ట్ కాక..కాక..ఆఖరికి స్టార్ట్ అయింది మెగాస్టార్ 150 వ సినిమా. మారతున్న ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో భాగంగా, ప్రచారం మీద కూడా మెగాస్టార్ బాగా దృష్టి పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. తెగ హడావుడి చేస్తున్నారు. తొలిరోజే చించేసారు..ఆరేసారు అంటూ ప్రచారం సాగించేస్తున్నారు. 

అంతే కాదు, దీనికి తోడు మా టీవీ అవార్డుల సంగతి ఒకటి కలిసివచ్చింది. దాంతో, అరవై ఏళ్ల చిరు, ముఫై ఏళ్ల నాడు ఎలా వున్నారో అలాగే వున్నారంటూ సందడి స్టార్ట్ చేసారు. మూడు రోజుల షూట్ కే ఇలా ప్రచారం హోరెత్తితే..ఇక సినిమా ఫినిషింగ్ నాటికి ఎలా వుంటుందో? అయితే సినిమా సంగతులతో ఈ హోరుసాగితే బాగుంటుంది కానీ.. అన్న అడుగేస్తే సూపర్.. చిందేస్తే సూపర్ అంటూ భజనలా సాగితే మాత్రం అంత బాగోదేమో? 

అంతకన్నా అడపా దడపా సినిమా అప్ డేట్స్ తో అభిమానులను అలరిస్తే బాగుంటుంది. ఇలాంటి ప్రచారం హీరోకి ఆనందంగా వుంటుందేమో కానీ సినిమాకు కాదేమో?