Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

డిసెంబర్ కు మహేష్ సినిమా పూర్తి

డిసెంబర్ కు మహేష్ సినిమా పూర్తి

ఈసారి మహేష్ బాబు తన సినిమా విషయంలో పక్కా ప్లానింగ్ తో వెళ్లబోతున్నాడు. సాధారణంగా మురుగదాస్ సినిమా అంటే ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. అందునా మురుగదాస్ వివిధ భాషల్లో ఒకేసారి తయారవుతుంది. అందునా ఈసారి మహేష్ నే హిందీతో సహా చేయాలనుకుంటున్నాడని వినికిడి. 

మరి అలాంటపుడు సినిమా నిర్మాణం ఎన్నాళ్లు పడుతుంది అన్న అనుమానం సహజం. కానీ మురగదాస్ తన సినిమాను డిసెంబర్ నాటికి మొత్తం టాకీ, తదితర పనులు పూర్తి చేసే విధంగా ప్లాన్ తయారుచేసి పెట్టుకున్నాడట. ముఖ్యంగా స్క్రిప్ట్ మొత్తం పక్కాగా రెడీ చేసుకోవడం,షెడ్యూల్ అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకోవడం ద్వారా డిసెంబర్ నాటికి టాకీ పార్ట్ అంతా ఫినిష్ చేసేస్తాడట. 

జనవరి నుంచి మహేష్ మరి ఈ సినిమా మీద పనిచేయాల్సిన అవసరం వుండదు. మరో సినిమా మీదకు వెళ్లిపొవచ్చు. అదీ స్ట్రాటజీ. అయితే ఆ తరువాతి సినిమా ఎవరితో అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. పూరి జగన్నాధ్ అన్నది బయటకు వినిపించేది కానీ, మరో ఇద్దరు పెద్ద దర్శకులు కూడా మహేష్ జాబితాలో వున్నట్లు వినికిడి. ఆ కాంబినేషన్లు ఫిక్స్ అయితే చాలా క్రేజీగా వుండేవే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?