183షేర్ లు..185కామెంట్లు, 3.4కె లైకులు ఇవీ హీరోయిన్ పూనమ్ కౌర్ పెట్టిన ఓ అయిదు లైన్ల పోస్టుకు వచ్చినవి. ఇంతకీ అమ్మడు పెట్టిన పోస్టు్ ఏమిటి?
''…కాన్సెప్ట్స్ కాపీ చేసి … డైలాగ్స్ కాపీ చేసి… బట్టలు మార్చుకుంటూ.. మనసులు మారుస్తూ.. మాట మీద ఉండకపోవటం.. జనాల అమాయకత్వంతో ఆడుకుంటూ.. వేశ భాషలు మారుస్తూ జనాలను మభ్యపెట్టి.. అమ్మాయిలను అడ్డం పెట్టుకుంటు రాజకీయాలు చేస్తున్నారు కొంతమంది.. ఆ భగవంతుడే… నిజం ఎంటో అని తెలిపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..''
వాక్య నిర్మాణం సరిగ్గా లేకున్నా, ఓ పంజాబీ అమ్మాయి, ఈమాత్రం తెలుగులో తన అభిప్రాయాన్ని చెప్పగలిగింది అంటే మెచ్చుకోవాలి. ఈ అయిదు లైన్ల పోస్ట్ లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన ఎక్కడా లేకున్నా, కింద కామెంట్ల రూపంలో మాత్రం పవన్ అభిమానులు, వ్యతిరేకులు తమ చిత్తానికి ఎడాపెడా మాటలతో కొట్టుకున్నారు.
పూనమ్ కౌర్ కు పవన్ కు మధ్య మంచి సంబంధాలు వున్నాయని, ఆమెకు ఆంధ్రలో పోస్టు ఇప్పించింది అతనే అని గుసగుసలు వున్నాయి. వాటి ఫలితమే ఈ అయిదు లైన్ల పోస్టులో పవన్ కళ్యాణ్ ను అందరూ విమర్శించడానికి కారణం. కాన్సెప్ట్ లు కాపీ కొట్టడం, డైలాగులు కాపీ కొట్టడం (అంటే అజ్ఞాతవాసి?), బట్టలు మార్చడం (సినిమా నటులకు తప్పనిసరి) మనసులు మారుస్తూ (మూడు పెళ్లిళ్ల ప్రస్తావన?) ఇంత వరకు ఓకె అనుకుందాం..
కానీ ఆ తరువాత విషయాలు అన్నీ ఏమిటి? అమ్మాయిలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు ఏమిటి? భగవంతుడు నిరూపించాల్సిన రాజకీయం ఏమిటి?
ఇంతకీ పూనమ్ కౌర్ ఈ పోస్ట్ ఎందుకు పెట్టినట్లు? ఎవరిని ఉద్దేశించి పెట్టినట్లు? పైగా పవన్ నిన్నిటికి నిన్న తెలుగుదేశం ప్రభుత్వం పైన, లోకేష్, చంద్రబాబుపైనా విమర్శలు చేసిన తరువాతే ఈ పోస్ట్ రావడం యాధృచ్ఛికమా? మరేమైనా వుందా? ఏమున్నా లేకపోయినా, ఈ పోస్టు స్క్రీన్ షాట్ మాత్రం వాట్సప్ లో తెగ తిరుగుతోంది.