అక్కడ రాయలసీమ ఫాక్షనిస్ట్.. ఇక్కడ తెలంగాణలో దాదా
అక్కడ అన్నగా మంత్రి అండ.. ఇక్కడ ఓ మంత్రి అండ
అక్కడ పక్కన తల్లి.. ఇక్కడ పక్కన తండ్రి
అక్కడ హీరో తండ్రి పోలీస్ అధికారి.. ఇక్కడ హీరో తల్లి కానిస్టేబుల్
అక్కడ హీరో కబడ్డీ ఆడతాడు.. ఇక్కడా హీరో కబడ్డీ ఆడతాడు
అక్కడ హీరోయిన్ గత్యంతరం లేక ఒంటరి అవుతుంది.. ఇక్కడ హీరోయిన్ ఒంటరిగా వేరే ఊరు చేరుతుంది.
అక్కడ హీరో తండ్రి సవాల్ విసురుతాడు చివరిలో విలన్ కు.
ఇక్కడ హీరో తల్లి సవాల్ విసురుతుంది విలన్ కు చివరిలో.
మరీ ఇన్ని పోలికలా రెండు సినిమాలకు అని జనం అనుకుంటున్న మాట.
అదే మహేష్ బాబు ఒక్కడు, రవితేజ నటించిన రాజా ది గ్రేట్ సినిమాల గురించి. ఒక్కటే తేడా ఇక్కడ హీరో అంథుడు. కానీ ఆ విషయం సినిమాలో ఎక్కడా అనిపించదు. ప్రేక్షకుడు ఫీల్ కాడు.. అంథుడని ఫీల్ కావాల్సిన పరిస్థితి వుండదు.