Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

‘దేవర’ కు కూడా డబ్బుల చిక్కులు?

‘దేవర’ కు కూడా డబ్బుల చిక్కులు?

ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ప్రెస్టీజియస్ సినిమా ‘దేవర’. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న పాన్ ఇండియా సినిమా. అలాగే ఆచార్య ఫెయిల్యూర్ తరువాత కొరటాల సవాల్ గా తీసుకున్న సినిమా. ఒక సినిమాగా స్టార్ట్ చేసి, రెండు భాగాలుగా ప్రకటించారు. ఈ సినిమా నుంచి గ్లింప్స్ ఒకటి జనవరి ఫస్ట్ వీక్ లో వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ లోగా ఈ సినిమా మీద రకరకాల గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.

సినిమాను ఇప్పటి వరకు చాలా రోజులు షూట్ చేసి, కోట్ల కొద్దీ ఖర్చు చేసినా వచ్చిన ఫుటేజ్ తక్కువే అని ఓ గ్యాసిప్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. పెట్టిన కోట్ల కొద్దీ పెట్టుబడి అంటా ఫైట్ సీన్లకే ఖర్చయినట్లు తెలుస్తోంది. అసలు అందువల్లనే రెండు భాగాలుగా మార్చారని టాక్. తొలిభాగంలో విశ్రాంతి దగ్గర ఆపే కథను, రెండు భాగాలుగా చేయడం వల్ల తొలిభాగం చివరిలో ఆపుతారని తెలుస్తోంది.

ఇదేమంత పెద్ద విషయం కాదు కానీ, ప్రస్తుతానికి అయితే దేవర సినిమాకు కాస్త ఫండింగ్ అవసరం అని అందుకోసమే, సినిమా ఎలా వుండబోతోంది అన్నది క్లారిటీగా చెప్పేందుకు ఓ గ్లింప్స్ కట్ చేసారని టాక్ వినిపిస్తోంది. నిజానికి ఎన్టీఆర్-కొరటాల అంటే చిన్న కాంబినేషన్ కాదు. కానీ ఈ సినిమాను కొరటాల శివ స్వంత మిత్రుడే నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన సంస్థ అయితే నిధుల కోసం పెద్దగా తడుముకోనక్కరలేదు.

ఇదిలా వుంటే ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ నటిస్తోంది. ఆమె కాల్ షీట్లు కేవలం ముఫై రోజులకు కాస్త అటు ఇటుగా తీసుకున్నారని, సినిమాలో నాలుగు పాటలు వుంటేనే అన్ని రోజులు అవసరం పడతాయి కనుక, టాకీ సంగతి చూస్తే, హీరోయిన్ కు పెద్దగా ప్రాధాన్యత వుండదా సినిమాలో అని మరో గ్యాసిప్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?