దేవీశ్రీ ప్రసాద్. తెలుగు, తమిళ సినిమా రంగాల్లో సూపర్ స్టార్ హోదా సంపాదించేసిన మ్యూజిక్ డైరక్టర్. లేటెస్ట్ గా ఖైదీ నెంబర్ 150 సినిమాను కూడా తన మ్యూజిక్ మ్యాజిక్ తో ఓ రేంజ్ కు చేర్చేసాడు. దీంతో ఇప్పుడు తన రెమ్యూనిరేషన్ విషయంలో రూపాయి తగ్గడం లేదట.
రెండున్నర కోట్లు సాలిడ్ గా కేవలం తీసుకుంటున్నాడట. మరీ మొహమాటం, ఇంకా ఇంకా.. వత్తిడి ఇలాంటివి అన్నీ వస్తే, అప్పుడు మాత్రమే ఓ పాతిక వెనక్కు తగ్గుతున్నాడట. ఇది కూడా చాలా చాలా రేర్ కేసుల్లోనట. మామూలుగా మాత్రం రెండున్నర కోట్లకు వెనక్కు తగ్గడం లేదట.
ఈ రెండున్నర కోట్లకు అదనంగా లిరిక్ రైటర్ల రెమ్యూనిరేషన్, రికార్డింగ్ ఖర్చులు అన్నీ కలిపి సినిమాకు మూడు కోట్లకు మ్యూజిక్ ఖర్చే వుంటున్నాదట. అందుకే ఇక దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ భారీ సినిమాలకు తప్ప, మిడిల్ రేంజ్ సినిమాలకు కూడా ఇక అందడన్నమాట.