ఒక్కో వీక్ పాయింట్ లో తీసుకునే నిర్ణయం ఒక్కోసారి ఇబ్బందులకు గురిచేస్తుంది. కాస్త పాపులారిటీ రాగానే ఒక్కసారైనా హీరో పాత్ర వేసేయాలని కమెడియన్లకు అందరికీ వుంటుంది. బ్రహ్మానందం నుంచి వేణుమాధవ్ వరకు ఎవ్వరూ అతీతులు కారు. అందరూ ట్రయ్ చేసి వెనక్కు వచ్చిన వారే.
అయితే చాలా మంది కమెడియన్లు హీరోలు కావడం కోసం స్వంత డబ్బులు ఖర్చు చేయలేదు. ఎవరో ఒకరిద్దిరు తప్ప. ఇప్పుడు ఆ ఒకరిద్దరి జాబితాలో చేరాడు ధన్ రాజ్. కష్టపడి కింద నుంచి పైకి వస్తూ, ఆర్జించుకున్న డబ్బులు తన వంతుగా ధనలక్ష్మితలుపుతడితే…సినిమాలో పెట్టుబడి పెట్టాడని వినికిడి.
ఒకానొక సమయంలో, ఒక సినిమా నుంచి ఇబ్బంది కర పరిస్థితుల్లో తప్పుకోవాల్సి రావడంతో, ఆవేశపడి ఈ సినిమా చేసినట్లు టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. కష్టపడి సంపాదించుకున్న కోటి రూపాయిల వరకు ఖర్చు చేసాడని అంటున్నారు.
ఇప్పుడు అస్సలు చిన్న సినిమాలకు కలెక్షన్లు వుండడం లేదు. ధనలక్ష్మి పరిస్థితి కూడా ఇందుకు అతీతం కాదు. పాపం..ధనరాజ్..సంపాదించుకున్న డబ్బులు 'జబర్దస్త్' గా దాచుకోకుండా ఇలా ఎందుకు చేసాడో?