మొత్తానికి రామ్ చరణ్ ధృవ పరిస్థితి అయోమయంలో పడిపోయింది. టైమ్ వున్నపుడు ఆ సినిమాను ఎంత నీరసంగా ముందుకు తీసుకెళ్లాలో అంతా చేసారు. దీంతో సినిమా దసరా నుంచి దీపావళికి, ఆపై ఇంకా వెనక్కు వచ్చింది. తీరా ఇప్పుడు చూస్తే డిసెంబర్ లో డేట్ లు సెట్ కావడం లేదు.
రెండున వద్దాం అనుకుంటే వీలు కాలేదు. ఇంతలో నోట్ల రద్దు సమస్య వచ్చింది. సరే వన్ వీక్ వెనక్కు వెళ్దాం అనుకుంటే సూర్య సింగం 3 వచ్చి పడేలా వుంది. దీంతో మరికాస్త వెనక్కు వెళ్దాం అని ఆలోచిస్తున్నారు. దానికి అనువైన డేట్ జనవరి 1 అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అదే నెలలో పండగ టైమ్ లో మెగాస్టార్ సినిమా వుంది. అందువల్ల దాన్ని వెనక్కు పంపిస్తారని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. కానీ అవేవీ నిజం కాదని, ఫస్ట్ న రామ్ చరణ్ సినిమాను, రెండు వారాలు గ్యాప్ ఇచ్చి మెగాస్టార్ సినిమాను ఒకే నెలలో విడుదల చేసేద్దామని ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి.
ఎందుకంటే మళ్లీ ఫిబ్రవరి లేదా మార్చిలో పవన్ సినిమా ఆపై మహేష్ బాబు, బన్నీ, ప్రభాస్ ల సినిమాలు వున్నాయి. అందువల్ల మెగాస్టార్ సినిమా వెనక్కు వెళ్లే అవకాశమే వుండదని తెలుస్తోంది.
మరోపక్క ఎలాగైనా 9కు రావాలని అందుకోసం సూర్య సినిమాను 23న పెట్టుకోమని రాయబారాలు నడుపుతున్నారని కూడా వార్తలు వినవస్తున్నాయి.