ధృవను వెన్నాడుతున్న సెంటిమెంట్

డిసెంబర్ 9. ధృవ విడుదలకు ఫిక్స్ చేసిన డేట్. ఇప్పుడు అదే మెగా ఫ్యాన్స్ ను భయపెడుతోందని టాక్ వినిపిస్తోంది. కారణాలు రెండు. ఒకటి మెగా హీరోలు ఎవరికీ డిసెంబర్ లో అంతగా హిట్…

డిసెంబర్ 9. ధృవ విడుదలకు ఫిక్స్ చేసిన డేట్. ఇప్పుడు అదే మెగా ఫ్యాన్స్ ను భయపెడుతోందని టాక్ వినిపిస్తోంది. కారణాలు రెండు. ఒకటి మెగా హీరోలు ఎవరికీ డిసెంబర్ లో అంతగా హిట్ లు లేవు. రెండవ కారణం, అదే రోజు పవన్ కళ్యాణ్ పంజా విడుదలయింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో వరుణ్ తేజ లోఫర్ విడుదలయింది. అంతకు ముందు ఏడాదికి డిసెంబర్ లో వరుణ్ తేజ ముకుంద విడుదలయింది. ఈ రెండూ కూడా ఏవరేజ్ అనిపించుకున్న సినిమాలే తప్ప, హిట్ లు కావు. 

పంజా సంగతి చెప్పనక్కరలేదు. దీనికి తోడు ధృవకు మరో సమస్య వుందని వినిపిస్తోంది. సినిమా లెంగ్త్ రెండు గంటల నలభై నిమషాలు. కామన్ ఆడియన్స్ కు రిలీఫ్ గా బావించే పాటలు మాత్రం మూడే మూడు. అయితే సినిమా బాగా వచ్చిందని, కానీ వాట్సప్ లు, సిగరెట్ లు, ఇలాంటి వ్యవహారాలకు మాత్రం అవకాశం వుండదని, సినిమా ఆద్యంతం చూడాల్సిందే అని, మధ్యలో ఎక్కడ మిస్ అయినా లింక్ మిస్సయినట్లు వుంటుందని తెలుస్తోంది.