‘ధృవ’ తర్వాత ఈ మాటకు విలువెంత.!

ఓ సినిమా వస్తోందంటే, ఆ సినిమా దర్శకుడితో మరో సినిమా చేస్తానని ఆ సినిమాలో నటించిన హీరో చెప్పడం సాధారణమైన విషయమే. అదో టైపు పబ్లిసిటీ స్టంట్‌.! ఓ హీరో లేదా, ఆ హీరో…

ఓ సినిమా వస్తోందంటే, ఆ సినిమా దర్శకుడితో మరో సినిమా చేస్తానని ఆ సినిమాలో నటించిన హీరో చెప్పడం సాధారణమైన విషయమే. అదో టైపు పబ్లిసిటీ స్టంట్‌.! ఓ హీరో లేదా, ఆ హీరో ఫ్యామిలీకి చెందిన ఇంకో హీరో.. ఆ సినిమా టైమ్‌లో సదరు దర్శకుడి గురించో, లేదంటే ఆ సినిమా నిర్మాత గురించో, హీరో గురించో పాజిటివ్‌గా మాట్లాడటం వింతేమీ కాదు. ఇది పరమ రొటీన్‌ వ్యవహారం. 

'ధృవ' సినిమా తర్వాత, మెగాస్టార్‌ చిరంజీవితో ఓ సినిమా చేయనున్నట్లు సురేందర్‌రెడ్డి ప్రకటించడం కూడా ఇలాంటిదే కావొచ్చుగాక.! 'కిక్‌' లాంటి సినిమా చేస్తానని సురేందర్‌రెడ్డి చెబుతున్నాడుగానీ, అతని నుంచే 'కిక్‌-2' వచ్చిందన్న విషయం మెగాస్టార్‌ చిరంజీవికి తెలియదా.? సో, 'ధృవ' రిజల్ట్‌ తర్వాత సమీకరణాలు మారిపోతాయి. 'ధృవ' ఫలితాన్ని బట్టే సురేందర్‌రెడ్డితో సినిమా చేయాలా.? వద్దా.? అన్నదానిపై చిరంజీవి ఓ క్లారిటీకి రావొచ్చు. 

అన్నిటికీ మించి, ప్రస్తుతం 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా మీద ఫోకస్‌ పెట్టిన చిరంజీవి, ఆ సినిమా తర్వాతే ఏ సినిమా చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. నిజానికి 'ఖైదీ' విషయంలోనే చిరంజీవి నానా రకాలుగా ఆలోచించి, చివరికి వినాయక్‌ని ఓకే చేశారు. అంతకు ముందు చిరంజీవి పూరి జగన్నాథ్‌కి ఓకే చెప్పిన విషయం విదితమే. అది అటకెక్కి, వినాయక్‌ ముందుకొచ్చాడు. 

సినీ రంగంలో కాంబినేషన్లు ఎప్పటికప్పుడు సరికొత్తగా పుట్టుకొస్తాయి.. అప్పటికి కలుస్తాయనుకున్న కాంబినేషన్లు బ్రేక్‌ అయిపోతాయి. మరి, సురేందర్‌రెడ్డి – చిరంజీవి కాంబినేషన్‌ ఏమవుతుంది.? వేచి చూడాల్సిందే.