ధృవ విడుదల పక్కాయేనా?

డిసెంబర్ 2 కోసం మెగాభిమానులు, ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు ఎదురుచూస్తున్న తేదీ. ధృవ విడుదల తేదీ. అయితే ఆ రోజుకు ధృవ వస్తుందా అన్నది కూడా ఇంకా టెన్షన్ గానే వుందట. ఒక…

డిసెంబర్ 2 కోసం మెగాభిమానులు, ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు ఎదురుచూస్తున్న తేదీ. ధృవ విడుదల తేదీ. అయితే ఆ రోజుకు ధృవ వస్తుందా అన్నది కూడా ఇంకా టెన్షన్ గానే వుందట. ఒక సాంగ్, కొన్ని సీన్లు మాత్రమే బకాయి. ఇంకా నెల రోజులు సమయం వుంది. మరి ఇంకెందుకు టెన్షన్. కానీ విషయం ఏమిటంటే, గత నెల నాటికి కూడా ఇదే పొజిషన్. అప్పటికి ఇప్పటికీ పెద్దగా తేడా ఏమీ లేదు. ఏం జరుగుతోంది అన్న దానిపై క్లారిటీ లేదు కానీ, గుసగుసలు చాలా వున్నాయి. 

చకచకా పనులు కావడం లేదన్నది ఆ గుసగుసల్లో కీలకమైనది. సమస్య హీరో పనులతోనా, వేరే వ్యవహారాలు ఏమన్నానా అన్నది తెలియదు. ధృవ పరిస్థితి ఏమిటి? అన్నదానిపై ఇండస్ట్రీలో మాత్రం గుసగుసలు వున్నాయి. లాస్ట్ మినిట్ లో టెన్షన్ పడే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనిపిస్తున్నాయన్నది ఆ గుసగుసల సారాశం.

తమిళ సినిమా రీమేక్ కే ఇన్ని రోజులు ఎందుకు పడుతోందో అర్థం కావడం లేదని, మొదటి నుంచీ ఈ విషయంలో రామ్ చరణ్ చురుగ్గా వ్యవహరించకపోవడం వల్లనే అని టాక్. సాధారణంగా అల్లు అరవింద్ సినిమాలు అంటే స్క్రిప్ట్ దగ్గరే టైమ్ తీసుకుంటాయి తప్ప, షూటింగ్ పార్ట్ కాదు. కానీ మరి ఈ సినిమాకే ఎందుకువస్తోందో సమస్య?