రాజమౌళికి, వాళ్ళకీ తేడా ఏంటి?

'బాహుబలి' చిత్రాన్ని రెండు భాగాలుగా, నాలుగు వందల యాభై కోట్ల వ్యయంతో తీసి, అంతకు మూడింతల విజయాన్ని నిర్మాతలు అందుకోవడంతో, ఈ ట్రెండుని అర్జంటుగా ఫాలో అయిపోవాలని చాలా మంది చూస్తున్నారు. అగ్ర నిర్మాతల…

'బాహుబలి' చిత్రాన్ని రెండు భాగాలుగా, నాలుగు వందల యాభై కోట్ల వ్యయంతో తీసి, అంతకు మూడింతల విజయాన్ని నిర్మాతలు అందుకోవడంతో, ఈ ట్రెండుని అర్జంటుగా ఫాలో అయిపోవాలని చాలా మంది చూస్తున్నారు. అగ్ర నిర్మాతల నుంచి, అంతంతమాత్రం దర్శకుల వరకు అందరూ మరో 'బాహుబలి'ని తీర్చి దిద్దడం పెద్ద కష్టమేం కాదన్నట్టు వందల కోట్ల ప్రాజెక్టులని అనౌన్స్‌ చేస్తున్నారు. 

అయితే ఇన్ని కోట్ల వ్యయంతో సినిమా తీసే దర్శకుడి విజన్‌ అదే స్థాయిలో ఉండాలి. ఏమి తీయబోతున్నాడనేది ముందే ఊహించగలగాలి. బాహుబలి లాంటి భారీ ప్రాజెక్టుని తలపెట్టే ముందు రాజమౌళి ఎలాంటి సినిమాలు తీసాడనేది గుర్తుంచుకోవాలి. మగధీరతో మొదటిసారిగా తన ఊహలకి రెక్కలు తొడిగిన రాజమౌళి, ఈగ చిత్రంతో విజువల్‌ ఎఫెక్ట్స్‌పై పూర్తి పట్టు సాధించాడు.

తెలుగు సినిమా మార్కెట్‌కి నాలుగైదు రెట్లు ఎక్కువైన చిత్రాన్ని తాను తీర్చిదిద్దగలననే నమ్మకం వచ్చిన తర్వాతే బాహుబలిని రాజమౌళి తెరకెక్కించాడు. అయితే ఇదంతా కేవలం డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల వచ్చిందన్నట్టు చాలా మంది నిర్మాతలు, దర్శకులు గుడ్డిగా భారీ బడ్జెట్‌ చిత్రాలని అనౌన్స్‌ చేస్తున్నారు.

రాజమౌళి స్థాయిలో సినిమా తీయడానికి బడ్జెట్‌ ఒక్కటీ సరిపోదు, అలాంటిది పుల్‌ ఆఫ్‌ చేసే కాన్ఫిడెన్స్‌ వుండాలి. మామూలు కథలని తీసినంత తేలికగా లేని దానిని ఉన్నట్టు ఊహించుకుని తెరకెక్కించడం అంత ఈజీగా జరిగే పని కాదు. గ్రాఫిక్స్‌ నిపుణులు వున్నంత మాత్రాన అది జరిగిపోదు. వారిని గైడ్‌ చేసి, వారినుంచి కావాల్సింది రాబట్టుకునే అనుభవం తప్పనిసరి.