దిల్ రాజు కు ఆడియన్స్ పల్స్ తెలుసు. ఫ్యామిలీలు కదలి వస్తే కానీ, సినిమాలు అంతగా ఆడవనీ తెలుసు. పైగా తన బ్యానర్ అంటే ఫ్యామిలీ సినిమాల టచ్ వుండాల్సిందే అని అంతకన్నా తెలుసు. అందుకే 'నాన్న'ను తోడు తెచ్చుకున్నారు. నాన్నను తోడు తెచ్చుకోవడం ఏమిటా? అంటే, విషయం ఇది.
బెక్కం వేణుగోపాల్ ఓ సినిమా నిర్మించారు. కుమారి 21 ఎప్ సినిమాతో క్రేజ్ వచ్చిన హెబ్బా పటేల్ ఆ సినిమా గుర్తుకు వచ్చేలా, నేను నా బాయ్ ఫ్రెండ్స్ అంటూ. ఆ సినిమా పూర్తయింది. బెక్కం వేణుగోపాల్ తో వేరే సినిమా నిర్మాణ లావాదేవీలు వున్న దిల్ రాజు, ఈ సినిమా పంపిణీ బాధ్యతలు కూడా తన భుజం మీద వేసుకున్నారు.
కానీ నేను-నా బాయ్ ఫ్రెండ్స్ అంటే అమ్మ-నాన్నలు సినిమాకు వస్తారా? అనుమానం. అందుకే ఆయన సలహా ఇచ్చారని, ఆ మేరకు టైటిల్ మార్చేసారని వినికిడి. ఇప్పుడు ఆ సినిమా టైటిల్ నాన్న-నేను-నా బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కనీసం అమ్మలు కాకపోయినా, నాన్నలయినా సినిమాకు వస్తారేమో? చూడాలి దిల్ రాజు ఫ్యామిలీలకు వేసిన పాచిక పారుతుందేమో?