ఏ పెట్టుబడి లేకుండా, కేవలం రైటింగ్ స్కిల్స్ కే యాభైశాతం లాభాలు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. పింక్ రీమేక్ విషయంలో నిర్మాత దిల్ రాజు దర్శకుడు త్రివిక్రమ్ కు ఇచ్చిన ఆఫర్ ఇదే.
దిల్ రాజు ఈ ఆఫర్ ను చాలా తెలివిగా ఇచ్చారనే అనుకోవాలి. పవన్ కు దగ్గర కావడం, పవన్ చేత ఒకె అనిపంచుకోవడం చేయాలి అంటే ఇదే దగ్గర దారి అని దిల్ రాజు అనుకుని వుండాలి. ఆ మేరకు త్రివిక్రమ్ కు ఆ ఆపర్ ఇచ్చి వుండాలి.
అయితే రేవు దాటాక బోడిమల్లన్న అన్నట్లుగా పవన్ తో సినిమా సెట్ అయిన తరువాత మెల్లగా త్రివిక్రమ్ ను ఆయన అంతట ఆయన దూరం అయ్యేలా చేసారు. దిల్ రాజు వైఖరితో ఇగో హర్ట్ అయిన త్రివిక్రమ్ ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు దూరం అయ్యారు. దాంతో ఇక ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్ అన్న ఊసే లేదు.
దర్శకుడిగా వున్న ఎలాగూ వేణు శ్రీరామ్ స్క్రిప్ట్ వర్క్ కూడా చూసుుకుంటారు. దీనికి అదనపు ఖర్చు కూడాలేదు. అందువల్ల దిల్ రాజు ఎత్తుగడ బాగానే ఫలించినట్లు అనుకోవాలి. ఎటొచ్చీ పవన్ దగ్గర బ్రేక్ పడకుండా వుంటే.